తెలంగాణ కేబినెట్ భేటీకి EC గ్రీన్ సిగ్నల్.. వాళ్లు పాల్గొనడానికి వీల్లేదని షరతు

by GSrikanth |   ( Updated:2024-05-19 10:16:51.0  )
తెలంగాణ కేబినెట్ భేటీకి EC గ్రీన్ సిగ్నల్.. వాళ్లు పాల్గొనడానికి వీల్లేదని షరతు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర కేబినెట్ సమావేశం నిర్వహించుకోడానికి కేంద్ర ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే అత్యవసర విషయాలను మాత్రమే చర్చించాలని, ఎజెండాలో పేర్కొన్న ఉమ్మడి రాజధాని, రైతుల రుణమాఫీ అంశాలను ఇప్పుడే చర్చించుకోవద్దని స్పష్టం చేసింది. జూన్ 4 తర్వాత ఈ రెండు అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోవచ్చని, అప్పటివరకూ కుదరదని క్లారిటీ ఇచ్చింది. కేవలం ప్రకృతి వైపరీత్యాలు, అత్యవసరమైన అంశాలు, వాటిపై చర్చలు, నిర్ణయాలకు మాత్రమే ఇబ్బంది లేదని స్పష్టం చేసింది. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగ పాల్గొంటున్న ఆఫీసర్లు ఈ సమావేశానికి హాజరు కాకూడదని పేర్కొన్నది. కేబినెట్ సమావేశం నిర్వహించుకోడానికి ఈ నెల 16న రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిందని గుర్తుచేసిన ఎలక్షన్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ అవినాష్ కుమార్ ఆదివారం రాసిన రిప్లైలో పేర్కొన్నారు.

ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున అది పూర్తయ్యేంత వరకూ కేబినెట్‌లో చర్చించి నిర్ణయాలు తీసుకునే అంశాలకు ఇబ్బంది లేకుండా అత్యవసరమైన విషయాలపై చర్చకు ఎలాంటి అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఎజెండాలోని అంశాలను పరిశీలించిన తర్వాత జూన్ 2వ తేదీతో ముగుస్తున్న ఉమ్మడి రాజధాని అంశాన్ని, రైతులకు అమలు చేయాల్సిన రుణమాఫీ అంశాలను జూన్ 4 తర్వాత మాత్రమే డిస్కస్ చేయాలని స్పష్టం చేశారు. అందువ్లల ఈ రెండు అంశాలను లోక్‌సభ ఎన్నికలు, వాటి కౌంటింగ్ జూన్ 4న ముగిసేంత వరకు పక్కన పెట్టాలని, కేబినెట్ భేటీలో చర్చించి నిర్ణయాలు తీసుకోరాదని పేర్కొన్నారు..

Advertisement

Next Story

Most Viewed