- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పుట్టినరోజు నాడు నాలుగేళ్ల చిన్నారి పై వీధి కుక్కల దాడి...
దిశ, టేకులపల్లి : భద్రాద్రికొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలంలో ఓ అంగన్వాడి కేంద్రం వద్ద నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసిన సంఘటన మంగళవారం జరిగింది. రేగుల తండా గ్రామానికి చెందిన చిన్నారి తండ్రి ఇస్లావత్ అశోక్ తెలిపిన వివరాలు ప్రకారం టేకులపల్లి గ్రామపంచాయతీ ముత్యాలమ్మ గుడిసమీపంలో అంగన్వాడి కేంద్రానికి తన కుమారుడు అక్షయ్ నాయక్ (4) వెళ్లాడు. తరువాత అంగన్వాడి కేంద్రం నుంచి అక్షయ్ నాయక్ టాయిలెట్ కి బయటకు వచ్చినట్టు అంగన్వాడి సిబ్బంది తెలిపారు.
బయటకొచ్చిన అక్షయపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఈ దాడిలో బాలుడి ఎడమ కాలిని కరిచి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడిని వెంటనే స్థానిక సులానగర్ పీహెచ్సీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పుట్టినరోజు నాడే తన కుమారుడి పై కుక్కలు దాడి చేశాయని ఆవేదన వ్యక్తం చేశాడు. టేకులపల్లి మండలంలో వీధికుక్కల బెడద అధికంగా ఉందని మండలాధికారులు, గ్రామపంచాయతీ అధికారులు, చర్యలు తీసుకొని, వీధి కుక్కల బెడద నుంచి రక్షించాలన్నారు.