- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదు
దిశ, ఖమ్మం సిటీ : రైతులకు అన్యాయం జరిగితే సహించేది లేదని కలెక్టర్ ముజామిల్ ఖాన్ అన్నారు. ఖమ్మం వ్యవసాయ పత్తి మార్కెను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతులకు వ్యాపారులు చేసే అన్యాయంపై ఆరా తీశారు. మార్కెట్ మొత్తం తిరిగి పత్తి బస్తాల తేమ శాతాన్ని స్వయంగా పరిశీలించారు. 15 శాతం తేమ వచ్చిన పత్తిని కూడా వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేయడంతో మార్కెటింగ్ శాఖ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి సీజన్లో వ్యాపారులతో దళారులు తోడై రైతును చిత్తు చేస్తున్నట్లు వస్తున్నా ఆరోపణలపై ఆయన గతంలోనే మార్కెటింగ్ ఏడీకి ఆదేశాలు జారీ చేసినా ఫలితం లేకపోయింది.
దాంతో ఆయన వారిని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ ధర కంటే తక్కువ ధరకు కొనుగోలు చేయడం పట్ల అధికారుల తీరును ఎండగట్టారు. సీసీఐ కొనుగోలు ద్వారా రైతులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఎంఎస్పీ ధర కంటే తక్కువగా ఎవరు కొనుగోలు చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. వారి లైసెన్సులను కూడా రద్దు చేస్తామన్నారు. మార్కెట్ లో జరుగుతున్న విషయాలపై శ్రద్ధ వహించాలని మార్కెట్ కమిటీ సెక్రటరీ ప్రవీణ్ రెడ్డి, అధికారి అజీములకు సూచించారు. స్వయంగా ఆయనే పత్తి తేమ శాతాన్ని మిషన్ పెట్టి పరిశీలించారు.