- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
వచ్చే ఎన్నికల్లో మతతత్వ బీజేపీ, స్కాముల బీఆర్ఎస్ పతనం ఖాయం : మాజీమంత్రి సంభాని..
దిశ, వేంసూర్ : సత్తుపల్లి నియోజకవర్గంలో 28వ రోజు హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా వేంసూరు మండలంలోని కుంచపర్తి, జయలక్ష్మీపురం, కేజీ మల్లేల, శంభుని గూడెం గ్రామాలలో ఏఐసీసీ సభ్యులు, టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఇంటింటికి తిరిగారు. కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ది సాధ్యమని రాహుల్ గాంధీ సందేశాన్ని, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాల పై రూపొందించిన మ్యానిఫెస్టోని ప్రజలకు అందించారు. రాహుల్ గాంధీ పై అనర్హత వేటు బీజేపీ నియంతృత్వానికి, అణచివేతకు నిదర్శనమని, పరువునష్టం కేసులో వేసిన శిక్షకే అనర్హత వేటు వేస్తే క్రిమినల్ కేసులలో శిక్షలు పడ్డ బీజేపీ ఎంపీలు ఉన్నారని, వారి సంగతి ఏమిటని ? మండిపడ్డారు.
వారిపై ఇప్పటిదాకా ఎందుకు అనర్హత వేటు వేయలేదని మండిపడ్డారు. ప్రతిపక్షాలను అణిచివేయడమే లక్ష్యంగా బీజేపీ పాలన సాగుతున్నదని ప్రజలు చాలా తెలివైనవారని బీజేపీకి త్వరలోనే బుద్ధి చెపుతారని అన్నారు. దేశాన్ని దోచుకునే దొంగల కోసమే బీజేపీ పని చేస్తుందని మతాల పేరిట, కులాల పేరిట ప్రజలను విడగొడుతున్నారని, రాజకీయాల కోసం దేవుణ్ణి వాడుకుంటున్నారని దుయ్యబట్టారు. అలాగే తేలంగాణ లోని తొమ్మిదేళ్ళ బీఆర్ఎస్ దొరల పాలనలో కల్వకుంట్ల కుటుంబం తప్ప రాష్ట్రంలో ఏ ఒక్కరూ కూడా సంతోషంగా లేరని స్కాములతో, లీకులతో రాష్ట్రాన్ని నాశనం చేస్తూ నిరుద్యోగుల, విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్నారని రాష్ట్రాన్ని బంగారుతెలంగాణగా మారుస్తానని చెప్పి నేడు అప్పుల తెలంగాణగా మార్చి ప్రజల జీవితాలను అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు.
హస్తానికి ఐదువేళ్లు లాగే అధికారంలోకి రాగానే ప్రజలకు ఐదు మేలు చేస్తామన్నారు. ఏకకాలంలో రైతు రుణమాఫీ రెండు లక్షలు, ఆడబిడ్డలకు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇంటికి ఐదు లక్షల సాయం, ఇంట్లో ఇద్దరు వృద్ధులు ఉంటే కనీస పెన్షన్ ఐదువేలు, మొదటి ఏడాది రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కాసర చంద్రశేఖర్ రెడ్డి, పీసీసీ సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, కొండూరు కిరణ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు పుచ్చకాయల సోమిరెడ్డి, జిల్లా కిసాన్ సెల్ ప్రధానకార్యదర్శి రావుల పుల్లారావు, జమ్ముల సత్యం, పోట్రు వెంకటేశ్వరరావు, యూత్ కాంగ్రెస్ నాయకులు ఇజ్జగాని మధు, ఈడా జమలయ్య, గాదె ప్రసాద్, తుమ్మా రామకృష్ణ, కొనకళ్ళ నరసింహారావు, వెంకటఛారి, ముత్తయ్య, వెంకటేశ్వరరావు, అడసార్లపాడు సర్పంచ్ ప్రేమలత బుచ్చాలు, రాజేంద్ర, లక్ష్మారెడ్డి, కోట సత్యం, మాములురి రామకృష్ణ, మోరంపుడి కృష్ణారావు,దాడి సుధీర్ ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.