- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
AC halls : కమర్షియల్ క్లబ్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటికి...
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : కమర్షియల్ క్లబ్ గా మారిన కొత్తగూడెం క్లబ్ వ్యవహారాలు తవ్వేకొద్దీ బయట పడుతున్నాయి. స్పోర్ట్స్ క్లబ్ సొసైటీ గా రిజిస్ట్రేషన్ అయిన క్లబ్ లో సామాన్యులు అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. కొంతకాలం ఆటపాటలకు ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ ప్రస్తుతం పూర్తి కమర్షియల్ గా మారిపోయింది. ఇందులో ఏ శుభకార్యం జరిపించాలన్నా లక్షలు కురిపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుభకార్యం ఏదైనా వీరు నియమించిన వారితోనే ప్రతి పని చేయించుకోవాలట. టెంట్ హౌస్, డెకరేషన్, వంట మరే ఇతర పనులు చేపించుకోవాలన్నా ఆస్థాన పని వారితోనే లక్షలు కురిపించి పనులు చేపించుకోక తప్పడం లేదు అంటున్నారు ప్రజలు. తద్వారా క్లబ్బు నిర్వాహకులకు భారీగా కమిషన్లు ముడుతున్నట్లు పట్టణంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
సామాన్యులకు అందుబాటులో లేకుండా మొత్తం ఏసీ హాల్స్...
ఈ కమర్షియల్ క్లబ్ లో కొంతకాలం క్రితం వరకు సామాన్య మధ్య తరగతి ప్రజలకు ఉపయోగపడేలా నాన్ ఏసీ ఫంక్షన్ హాల్ ఉండేవి, కానీ ప్రస్తుతం వాటిని లక్షల రూపాయలు వెచ్చించి పూర్తిగా ఏసీగా హాల్గా మార్చారు. దీంతో తక్కువ ఖర్చులో వివాహాది శుభకార్యాలు జరుపుకునే అవకాశం పూర్తిగా లేకుండా పోయింది. అసలు ఈ క్లబ్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఎవరికి ఖర్చు చేస్తున్నారు ? ఎలా ఖర్చు చేస్తున్నారు ? అన్న ప్రశ్నలకు ఎటువంటి సమాధానం దొరకని పరిస్థితి ఏర్పడింది. అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఆర్డీవో, డీఎస్పీలు ఉన్నప్పటికీ వారికి ఎటువంటి లెక్క పత్రాలు అందజేయకుండా మమా అనిపిస్తున్నారు.
గోప్యంగా ఉంచిన ఆరు లక్షల దొంగతనం వ్యవహారం...
ఈ కమర్షియల్ క్లబ్లో కొంతకాలం క్రితం 6 లక్షల రూపాయలు దొంగతనం జరిగింది. ఈ దొంగతనం వెనుక ఎవరున్నారు ఏంటి అన్న నిజాలు బయటికి రాకుండా కనీసం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా ఇవ్వకుండా లో లోపల వ్యవహారం చెక్కబెట్టారు. క్లబ్ ద్వారా వచ్చిన కోట్ల రూపాయల ఆదాయాన్ని ఏం చేస్తున్నారో పూర్తిగా ఆడిటింగ్ జరిపించి ఇంటి దొంగల పై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.