- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
CCI: గూగుల్‌తో పాటు అనుబంధ సంస్థలపై విచారణకు సీసీఐ ఆదేశాలు
దిశ, బిజినెస్ బ్యూరో: ప్లేస్టోర్‌లో రియల్ మనీ గేమింగ్ యాప్‌ల లిస్టింగ్‌కు సంబంధించి అన్యాయమైన వ్యాపార పద్దతులను అనుసరిస్తున్న కారణంగా గూగుల్‌తో పాటు దాని అనుబంధ సంస్థలపై కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) విచారణకు ఆదేశించింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు ఇచ్చింది. సీసీఐ చట్టంలోని నిబంధనల ప్రకారం దీనిపై దర్యాప్తు చేపట్టాలని డైరెక్టర్ జనరల్‌కు కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. 60 రోజుల్లోగా విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాలని పేర్కొంది. గూగుల్ కంపెనీ తన ఆధిపత్యాన్ని దుర్వినియోగం చేసిందని, ఎంపిక చేసిన గేమింగ్ కంపెనీలకు అన్యాయమైన పద్దతిలో అనుకూలంగా వ్యవహరిస్తోందని, ఇది పోటీని తగ్గిస్తుందని ఆరోపిస్తూ సీసీఐ వివరించింది. వింజో గేమ్స్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీసీఐ నిర్ణయం తీసుకుంది. డైలీ ఫాంటసీ స్పోర్ట్స్, రమ్మీ యాప్‌లకు గూగుల్ ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు సీసీఐ పేర్కొంది.