MLA Payam : దళారులను నమ్మొద్దు...నేనే ఇండ్లు మంజూరు చేస్తా

by Sridhar Babu |
MLA Payam : దళారులను నమ్మొద్దు...నేనే ఇండ్లు మంజూరు చేస్తా
X

దిశ,మణుగూరు : అర్హులైన పేద ప్రజలందరికీ రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తుందని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు (MLA Payam Venkateshwarlu)అన్నారు. ఎంతోమంది పేద ప్రజలు ఉండటానికి ఇండ్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొనే ప్రభుత్వం ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తుందని తెలిపారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇందిరమ్మ ఇండ్ల(Indiramma's house)ను మంజూరు చేస్తుందని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు ఇప్పిస్తాం అని చెప్పి ఎవరైనా డబ్బులు వసూలు చేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని ఆయన ప్రజలను కోరారు.

తన సమక్షంలోనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అవుతాయని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల విషయంలో సంబంధించిన అధికారులు చురుకుగా పని చేయాలని, ఇండ్లు లేని నిరు పేదలను గుర్తించాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. దీపావళి పండుగ తరువాత నవంబర్ మొదటి వారంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కార్యకమాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర రాష్ట్ర మంత్రులు కలిసి ప్రారంభిస్తారని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో మొదటి విడతగా 3500 ఇండ్లు ఇవ్వబోతున్నామని చెప్పారు. ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇండ్లు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా దళారులను నమ్మొద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story

Most Viewed