దిశ ఎఫెక్ట్​...మాజీ మంత్రి ప్రధాన అనుచరుడికి ప్లాట్లు

by Disha Web Desk 15 |
దిశ ఎఫెక్ట్​...మాజీ మంత్రి ప్రధాన అనుచరుడికి ప్లాట్లు
X

దిశ, మయూరి సెంటర్ : ఖమ్మం రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ్ నగర్ లో మాజీ మంత్రి ఆంతరంగిక సిబ్బందిలో ముఖ్యులు మాజీ సర్పంచ్ భర్త తో కలిసి కోట్లు విలువ చేసే స్థలాలను కాజేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే మాజీ మంత్రి అండదండలు మెండుగా ఉండడంతో పేదలకు చెందాల్సిన భూములను కాజేసి నాటి తహసీల్దార్ తో సహా సింబ్బంది కూడా పేదల పక్షాన నిలబడకుండా ఆక్రమణ దారులకే అంటకాగడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగింది. రఘునాధపాలెం మండలం కోయచెలక గ్రామ రెవెన్యూ పరిధిలో గల పువ్వాడ ఉదయ నగర్ గ్రామ సర్వే నెంబర్ 192 లో నిరుపేదలకు కేటాయించిన ప్రభుత్వ ఇండ్ల స్థలాలు నకిలీ పత్రాలతో అమ్మకంలో మాజీ సర్పంచ్ భర్తకు, మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి

అండదండలు మెండుగా ఉన్నట్టు తెలుస్తుంది. పార్టీకి నక్క వినయం ప్రదర్శించిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు మాజీ మంత్రి ప్రధాన అనుచరుడు నయానా, భయానా పేదలకు కేటాయించిన ప్లాట్లను తక్కువ ధరకే ఇప్పించినట్లు తెలుస్తుంది. మాజీ మంత్రి ప్రధాన అనుచరుడికి బినామీ పేర్లతో అనేక ప్రభుత్వ ప్లాట్లు ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీరితో పాటుగా కొందరు విలేకరులు, మండల నాయకులు, హెచ్ఆర్సీ పేరుతో మహిళా నాయకులు, మూడు నుంచి నాలుగు ప్లాట్లను ఆక్రమించినట్లు తెలుస్తుంది. 2020 సంవత్సరంలో ఎమ్మార్వో ఇచ్చిన నివేదికలో విస్తుపోయే నిజాలు వెలుగు చూశాయి. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్న వ్యక్తులకు స్థానిక ఎమ్మార్వో నోటీసులు ఇచ్చి డాక్యుమెంట్లతో సహా విచారణకు హాజరు కమ్మంటే.. ఇంతవరకు అక్రమార్కులు హాజరుకానట్టు తెలుస్తుంది. స్థానికుల ఫిర్యాదు మేరకు తెలంగాణ లోకయుక్త కోర్టులో 856/2020 బి1 కేసు రిజిస్టర్ అయ్యి, 20 సార్లకు పైగా విచారణ జరిగినా కానీ ఇంత వరకు కలెక్టర్ కానీ, ఆర్డీవో కానీ విచారణకు కోర్టు ముందు సంబంధిత పత్రాలతో ప్రత్యక్షంగా హాజరు కాలేదంటే అతిశయోక్తి కాదు.

అధికారులు వెనకడుగు

పువ్వాడ ఉదయ నగర్ గ్రామం సర్వే నెంబర్ 192 లో అప్పటి కలెక్టర్ ఉషారాణి పేదలకు కేటాయించిన 2292 ప్రభుత్వ ఇండ్ల స్థలాలను కేటాయించారు. నకిలీ పత్రాలు సృష్టించి విక్రయించిన అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలంటూ 2020 సంవత్సరం గ్రీవెన్స్ లో కొంత మంది మహిళలు అప్పటి కలెక్టర్ కర్ణణ్ కు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించి నివేదిక సమర్పించాలని కలెక్టర్, రఘునాధపాలెం ఎమ్మార్వో ను ఆదేశించారు. విచారణకు హాజరవ్వాలంటూ అక్రమార్కులకు ఎమ్మార్వో నోటీసులు ఇచ్చినా కానీ ఇంత వరకు హాజరు కాలేదు. అధికారులు మారి కాలం గడుస్తుందే తప్ప ఇంతవరకు ఎలాంటి నివేదికను కోర్టుకు సమర్పించలేదు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఇంటిలిజెన్సీ అధికారులు ఆరా?

పేదలకు కేటాయించిన 2292 ప్రభుత్వ ప్లాట్లను ఆక్రమించి, అమ్మిన ప్రజా ప్రతినిధిపై దిశ పత్రికలో శుక్రవారం ప్రచురితమైన ‘మనకు అడ్డు ఎవరు’ కథనానికి ఇంటిలిజెన్సీ అధికారులు స్పందించారు. మొత్తం ప్లాట్లెన్ని ఎవరెవరు విక్రయించారు. ఎవరెవరి పాత్రను ఎంత వరకు ఉందన్న విషయంపై ఇంటిలిజెన్సీ అధికారులు ఆరా తీశారు. ప్రభుత్వ ఇండ్ల స్థలాలను అమ్మి ఎంత కూడబెట్టారు? అనే దానిపై ప్రభుత్వానికి నివేదిక అందజేస్తున్నట్టు తెలుస్తుంది.

ప్రజా ప్రతినిధి భర్త పై లోకయుక్త లో ఫిర్యాదు : జక్కం స్వాతి, పువ్వాడ ఉదయ నగర్ గ్రామం





రఘునాథపాలెం మండలం పువ్వాడ ఉదయ నగర్ గ్రామపంచాయతీ పరిధిలో పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలను మాజీ సర్పంచ్ భర్త ఇతరులకు విక్రయంపై లోకయుక్తలో 2019 జనవరిలో ఫిర్యాదు చేశాను. దాన్ని దృష్టిలో ఉంచుకున్న అధికారులు నేనే ప్లాట్ ఆక్రమించాను అంటూ ఫిర్యాదు చేసి, నాపై కేసు నమోదు చేశారు. ఎప్పటికైనా న్యాయం జరిగిందని ఎదురుచూస్తున్నా.


Next Story

Most Viewed