పింఛన్ల పంపిణీపై సీఈసీ కీలక ఆదేశాలు.. నాలుగు రోజుల ముందు సంచలన నిర్ణయం

by Disha Web Desk 9 |
పింఛన్ల పంపిణీపై సీఈసీ కీలక ఆదేశాలు.. నాలుగు రోజుల ముందు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీలో పింఛన్ల రచ్చ ఏ విధంగా దుమారం రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. టీడీపీ, జనసేన, వైసీపీ మధ్య మాటల యుద్ధమే జరిగింది. ఒకనొక సందర్భంలో పెన్షన్ ఇవ్వకుండా టీడీపీ అడ్డుపడుతుందని వైసీపీ, వైసీపీ అడ్డుపడుతుందని టీడీపీ ఒకరిపై విమర్శల వర్షం కురిపించుకున్నారు. ఇక మొత్తానికి పింఛన్లు పంపిణీ విషయంలో వాలంటీర్లను ఈసీ పక్కన పెట్టిన విషయం తెలిసిందే. తాజాగా ఈసీ పెన్షన్ల వ్యవహారంపై కొత్త టర్న్ తీసుకుంది. ఈ క్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి మే నెల పెన్షల పంపిణీపై ఎన్నికల సంఘానికి క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఇంటింటికి ఫించన్లను పంపిణీ చేయాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది.

ఇప్పటికే పింఛన్ విషయంలో అనేక ఫిర్యాదులు వచ్చాయని పేర్కొంది. మే 1 నుంచి వృద్ధులకు ఇబ్బంది కలగకుండా ఇంటివద్దకే పింఛన్లు జారీ చేసేలా చర్యలు తీసుకోవాలని వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే ఇందుకు ఉపయోగించుకోవాలని ఆదేశించింది. ఇంటింటికి పింఛను పంపిణీ వీలు కాకపోతే డీబీటీ ద్వారా చెల్లించాలని ఆదేశాల్లో ఈసీ పేర్కొంది. అలాగే తీవ్రమైన ఎండల నేపథ్యంలో ఉదయం 7 గంటల నుంచే పంపిణీ మొదలుపెట్టి.. రాత్రి 7 గంటల వరకు కొనసాగిస్తామని వెల్లడించింది. కాగా, ఒకటో తారీఖు సమీపిస్తోన్న వేళ నాలుగు రోజుల ముందే ఆదేశాలు జారీ చేశారు.



Next Story

Most Viewed