- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జనసేన’ పార్టీ కోసం పాట పాడిన సురేష్ కొండేటీ (వీడియో).. ఆ నాలుగు ఓట్లు కూడా పడేలా లేవంటూ ట్రోల్స్
దిశ, సినిమా: సురేష్ కొండేటి జర్నలిస్ట్‌గా, నిర్మాతగా, నటుడిగా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ఆయనకు మైక్ దొరకడమే ఆలస్యం.. హీరో, హీరోయిన్స్‌ను అడగకూడని అడుగూ వివాదాలు ఎదుర్కొంటాడు. ఆయనపై ఎన్ని ట్రోల్స్ వచ్చినా పట్టించుకోకుండా ఫేమస్ అయ్యేందుకే ప్రయత్నిస్తుంటాడు. తాజాగా, సురేష్ కొండేటి పవన్ కల్యాణ్ జనసేన తరపున ప్రచారం చేస్తున్నాడు. అలాగే ఓ పాటను కూడా ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేసి ట్రోల్ ఎదుర్కొంటున్నాడు. సింగర్ శ్రీకృష్ణ పాడిన పాటను.. ప్రమోషన్స్‌లో భాగంగా సురేష్ కొండేటి పాడి జనాలకు వినిపించాడు.
అందులో ఒక నిమిషంపాటు వీడియోను రిలీజ్ చేస్తూ.. ‘‘జర్నలిస్టుగా కెరీర్ మొదలు పెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా నటుడిగా ఇలా తెలుగు సినీ కళామతల్లికి ఎన్ని విధాల సేవ చేసుకోగలిగితే అన్ని విధాల సేవ చేసుకుంటూ వస్తున్న నాకు మరో మహా భాగ్యం దక్కింది. ఈ ఏడాది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బాగు కోసం ఎంత కష్టపడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి జనసేనకు నా ఆధ్వర్యంలో ఒక అద్భుతమైన సాంగ్ సిద్ధం చేయడం జరిగింది.
సింగర్ శ్రీకృష్ణ గాత్రంతో రికార్డు చేయబడిన ఈ పాటను ప్రమోషన్స్ లో భాగంగా నేను కూడా పూర్తిగా ఈ పాటను పాడాను అందులో ఒక నిమిషం నిడివి గల వీడియోను రిలీజ్ చేస్తున్నాను. వెలుగుల మహేందర్ సమర్పణలో విజయ్ బెల్లంకొండ రచించిన ఈ పాటను డ్రమ్స్ రాము స్వరపరిచారు’ అంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా తాను పాడిన వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం సురేష్ కొండేటి వీడియో నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తూ పలు పోస్ట్‌లు పెడుతున్నారు. మళ్లీ పాట పాడటానికి ట్రై చేయకు.. ఈ సాంగ్ వల్ల పడే ఆ నాలుగు ఓట్లు కూడా పడేలా లేవు అని కామెంట్లు పెడుతున్నారు.
జర్నలిస్టుగా కెరియర్ మొదలుపెట్టి అంచలంచెలుగా ఎదుగుతూ డిస్ట్రిబ్యూటర్ గా నిర్మాతగా నటుడిగా ఇలా తెలుగు సినీ కళామతల్లికి ఎన్ని విధాల సేవ చేసుకోగలిగితే అన్ని విధాల సేవ చేసుకుంటూ వస్తున్న నాకు మరో మహా భాగ్యం దక్కింది. ఈ ఏడాది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ బాగు కోసం ఎంత కష్టపడుతున్నారో… pic.twitter.com/pdP4wSmB5v
— Suresh Kondeti (@santoshamsuresh) May 7, 2024