నాది దక్షిణ భారతదేశమే.. నేను భారతీయునిగా కనిపిస్తున్నాను!.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర ట్వీట్

by Disha Web Desk 5 |
నాది దక్షిణ భారతదేశమే.. నేను భారతీయునిగా కనిపిస్తున్నాను!.. స్టార్ హీరోయిన్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశ ప్రజలపై ఇండియన్ ఓవర్సిస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో తీవ్ర దుమారం రేగుతున్న విషయం విధితమే. అయితే దీనిపై సినీ సెలబ్రెటీలు సైతం స్పందిస్తున్నారు. తెలుగు, తమిళ, కన్నడ బాషల్లో నటించి స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న నటి ప్రణీత సుభాష్ శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై ఆసక్తికర ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేయగా.. దీనికి సినీ తార ప్రణీత సుభాష్ ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. దీనిపై ఎక్స్ లో ఆమె ఫోటోను షేర్ చేస్తూ.. నేను దక్షిణ భారత దేశానికి చెందినవారిని, నేను భారతీయునిగా కనిపిస్తున్నాను! అంటూ శామ్ పిట్రోడాను ట్యాగ్ చేశారు.
దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. మనం ఇండియన్స్ కానీ శామ్ పిట్రోడాకు ఆఫ్రికన్ లా కనిపిస్తాము అని కొందరు అంటుండగా.. మరి కొందరు వారి ఫోటోలను షేర్ చేస్తూ మేము ఇండియన్ లా కనిపిస్తున్నామా? అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. నేను దక్షిణ భారతదేశానికి చెందినవారిని, నేను భారతీయునిగా కనిపిస్తున్నాను! నా బృందంలో ఈశాన్య భారతదేశం నుండి ఉత్సాహభరితమైన సభ్యులు ఉన్నారు. వారు భారతీయులుగా కనిపిస్తారు! పశ్చిమ భారతదేశానికి చెందిన నా సహచరులు భారతీయులుగా కనిపిస్తున్నారు! కానీ, జాత్యహంకారానికి మార్గదర్శి అయిన రాహుల్ గాంధీకి మనమందరం ఆఫ్రికన్, చైనీస్, అరబ్, వైట్‌గా కనిపిస్తాము! మీ మనస్తత్వం మరియు మీ వైఖరిని బహిర్గతం చేసినందుకు ధన్యవాదాలు. ఇది I.N.D.I కూటమికి అవమానం! అని ఎక్స్ వేదికగా ఫైర్ అయ్యారు.

Next Story