- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది: కాంగ్రెస్ నేత వీహెచ్ సంచలన ఆరోపణలు
దిశ, వెబ్‌డెస్క్: దేశాన్ని విడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కర్ణాటక, తెలంగాణలో ముస్లిం రిజర్వేషన్లను ఎత్తివేస్తామని బీజేపీ స్టేట్‌మెంట్లు చేస్తోందని ఆరోపించారు. అదే ఆంధప్రదేశ్‌లో మాత్రం ముస్లిం ఓట్లు రాబట్టేందుకు ముస్లింల రిజర్వేషన్ల అంశం మాట్లాడటం లేదని మండిపడ్డారు. అక్కడ తమ కూటమి పార్టీల కోసం కమలం పార్టీ ద్వంద విధానాలను అవలంభిస్తోందని ఫైర్ అయ్యారు. ఈ విషయంలో రాహుల్ గాంధీ ఏం చేయబోతున్నారో ప్రజలకు వివరించాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపారు. రాహుల్ గాంధీ దేశాన్ని జోడించేందుకు ప్రయత్నిస్తే.. నరేంద్ర మోదీ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రాలో మసీదుల్లో పనిచేసే ఇమామ్‌లకు రూ.10 వేలు, పెన్షన్ రూ.5 వేలు ఇస్తామంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారని, మరి తెలంగాణలో ఉన్న ముస్లింలు ఏం పాపం చేశారంటూ మోడీపై ఫైర్ అయ్యారు.