- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దిశ ఎఫెక్ట్... సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ సీజ్
దిశ, ఖమ్మం రూరల్ : నో కన్వర్షన్.. నో పర్మీషన్ అనే శీర్షిక శనివారం దిశ దినపత్రికలో ప్రచురితమైన విషయం తెలిసిందే. ఈ కథనానికి స్పందించిన ఎంపీఓ రాజారావు, పంచాయతీ కార్యదర్శి భాస్కర్ రావు కలిసి అక్రమంగా నిర్వహిస్తున్న పైపుల ఫ్యాక్టరీని శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. తాత్కాలికంగా కంపెనీని మూసి వేయాలని ఆదేశించారు. ఇండస్ట్రియల్ మేనేజర్ పరిశీలన తర్వాత, అన్ని అనుమతులు తీసుకొని నిర్వహించాలని కోరారు. అనుమతులు లేకుండా కంపెనీ నిర్వహించడం నేరమన్నారు.
అనుమతులపై ఆరా
దిశ దినపత్రికలో వచ్చిన అక్రమ సిమెంటు ఫ్యాక్టరీపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీశారు. అనుమతులు లేకుండా ఎలా నిర్వహిస్తారని సంబంధిత అధికారుల పాత్రపై వారు ఆరా తీసినట్లు తెలిసింది.
నిబంధనలకు నీళ్లు...
నిన్నటి వరకు గొల్లగూడెం పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన అధికారి నిబంధనలకు విరుద్ధంగా ఎన్వోసీ ఇవ్వడంతోనే అక్రమ సిమెంట్ ఫ్యాక్టరీకి బీజం పడింది. అసలు ఎటువంటి ధ్రువపత్రాలు పరిశీలించకుండానే కార్యదర్శి ఎలా ఎన్వోసీ ఇచ్చిందో ఆమెకే తెలియాల్సి ఉంది. ఈ ఎన్వోసీ ఇచ్చేందుకు లక్షల రుపాయలు చేతులు మారినట్లు తెలిసింది. నిబంధనలకు విరుద్దంగా ఎన్వోసీ ఇచ్చిన సంబంధిత కార్యదర్శిపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. కాగా అక్రమ నిర్వహణపై కథనం రాసిన దిశను పలువురు అభినందించారు.
- Tags
- Disha effect