పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏ ముందు ధర్నా

by Aamani |
పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ఐటీడీఏ ముందు ధర్నా
X

దిశ, భద్రాచలం : భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ముందు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు.అనంతరం ఐటీడీఏ ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్ కి వినతి పత్రం సమర్పించారు.జిల్లా కార్యదర్శి కారం పుల్లయ్య మాట్లాడుతూ, చర్ల మండలం కలివేరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న రజబల్లి కాలనీ చెందిన ఆదివాసిలు గత 40 సంవత్సరాల నుండి పోడు వ్యవసాయం చేసుకుంటున్న వారికి ఆటవి హక్కుల గుర్తింపు చట్టం 2006 ప్రకారం హక్కు పత్రాలు ఇవ్వలేదని, మొత్తం 58 కుటుంబాలకు ఇవ్వాలని ఆయన కోరారు.

అదేవిధంగా ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామానికి చెందిన వలస ఆదివాసీలకు పట్టాలు ఇవ్వాలని,48 కుటుంబాలు గత 30 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు పట్టాలు రాలేదని అన్నారు, ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహాయ కార్యదర్శి కుంజా శ్రీను, పోడు సాగుదారులు, మడకం సీతయ్య, మడకం నాగేష్, యసం చిన్నబి, నూప మల్లయ్య , ఇరప ముత్తయ్య, కారం సింగమ్మ ,మడకం ఉంగమ్మ ,సున్నం సమ్మక్క, కనితి జోగయ్య ,మడకం వీరయ్య ,బీరప్పగుట్టయ్య , ఉయక గీత, ముక్కోటి సురేష్ ,మడి అనిల్ ఇంకా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed