కేసీఆర్ విజన్ తోనే తెలంగాణ అభివృద్ధి: ఎంపీ నామ, ఎమ్మేల్యే సండ్ర

by Shiva |
కేసీఆర్ విజన్ తోనే తెలంగాణ అభివృద్ధి: ఎంపీ నామ, ఎమ్మేల్యే సండ్ర
X

దిశ, కల్లూరు: సీఎం కేసీఆర్ పారదర్శక పాలన, విజన్ వల్లే 70 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలో జరిగిందని బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. సోమవారం వారు కల్లూరు మండల పరిధిలోని కల్లూరు, కప్పలబంధం, బత్తులపల్లి, గోకవరం, పుల్లయ్య బంజార, తూర్పు లోకారం, పడమటి లోకవరం తదితర గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు, చెక్ డ్యాం, పంచాయతీ భవనాలు, పల్లె దవాఖాన, వంతెనలు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ నామ, ఎమ్మెల్యే సండ్ర మాట్లాడుతూ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి అహర్నిశలు శ్రమిస్తున్న కేసీఆర్ కు రానున్న కాలంలో ప్రజలు మరింత అండగా ఉండాలన్నారు. తాను రైతు బిడ్డనని.. రైతు కష్టాలు కళ్లారా చూశానని.. ఆ రైతు కోసమే కేసీఆర్ ప్రవేశ పెట్టని పథకం లేదని పేర్కొన్నారు. రైతులు బాగుంటేనే రైతు కూలీలు, బడుగు బలహీన వర్గాలు వారు బాగుంటారని భావించి రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత కేసీఆర్ కే దక్కుతోందన్నారు.

దేశంలో రైతుబంధు, ఉచిత విద్యుత్ ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణేనని తేల్చిచెప్పారు. రాబోయే సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను భారీ మెజారిటీతో గెలిపించి మూడోసారి కేసీఆర్ను సీఎం చేయాలన్నారు. అదేవిధంగా పడమర లోకవరంలో సీసీ రోడ్లకు రూ.10లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేస్తున్నట్లు నామ ప్రకటించారు. ఆయా కార్యక్రమాల్లో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరావు, ఎంపీపీ బీరవల్లి రఘు, జట్పీటీసీ కట్టా అజయ్ కుమార్, పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story