తాలిపేరు పరిసర ప్రాంత ప్రజలకు డేంజర్..హెచ్చరిక జారీ చేసిన అధికారులు

by Aamani |
తాలిపేరు పరిసర ప్రాంత ప్రజలకు డేంజర్..హెచ్చరిక జారీ చేసిన అధికారులు
X

దిశ, భద్రాచలం : చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. గత వారం రోజులుగా తెలంగాణ, చతిస్గడ్ సరిహద్దు అటువైపు ప్రాంతంలో భారీగా వర్షాలు కురుస్తుండడంతో ఆలి పేరు ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయానికి 1,42,070 క్యూసెక్కుల నీరు తరలిరాగా, అధికారులు 24 గేట్లు ఎత్తి 1,37,518 క్యూసెక్కుల నీటిని దిగనున్న గోదావరిలోకి వదిలారు.ప్రాజెక్టుకు ఇంకా భారీగా వరద నీరు తరలివస్తుందని, సమీప గ్రామాలు పెద్ద మిడిసి లేరు, బి.కొత్తూరు , చిన్న మిడిసి లేరు, ఆంజనేయపురం, దోసిల్లపల్లి, భూమిని లంక, గుంపిన గూడెం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. గత పది సంవత్సరాలలో కాలి పేరు ప్రాజెక్టుకు ఇంత పెద్ద ఎత్తున వరద తరలి రావడం ఇదే మొదటిసారి.

Advertisement

Next Story