- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
హత్యాయత్నం కేసు కొట్టివేస్తూ కోర్టు తీర్పు
దిశ, ఖమ్మం రూరల్ : ఖమ్మం రూరల్ మండలం గూడూరు పాడు గ్రామానికి చెందిన సీపీఐ నాయకులు పుచ్చకాయల కమలాకర్, సిద్దినేని కర్ణ కుమార్ తో పాటు మరో 23 మందిపై నమోదైన హత్యాయత్నం కేసును కొట్టివేస్తూ కోర్టు మంగళవారం తీర్పును వెలువరించింది. 2016లో (తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం) రోజు సీపీఐ, బీఆర్ఎస్ నాయకులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన సత్తి సంగయ్య గుండెపోటుతో మృతి చెందాడు. కాగా దీనిపై బీఆర్ఎస్ నాయకులు ఇచ్చిన తప్పుడు ఫిర్యాదు మేరకు పోలీసులు 302, 307 కేసులను నమోదు చేశారు. ఈ కేసులను సవాల్ చేస్తూ సీపీఐ నాయకులు పుచ్చకాయల కమలాకర్ హత్య జరగలేదని గుండెపోటుతో మృతి చెందినట్లు డిశ్చార్జ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. విచారించిన కోర్టు 302 కేసును ఉద్దేశపూర్వకంగా పెట్టినదిగా భావించి 2018లో కొట్టివేసింది. అప్పటినుంచి 307 కేస్ 7 సంవత్సరాలు సుదీర్ఘ విచారణ జరిగి తాజాగా జిల్లా సబ్ కోర్ట్ జడ్జి అమరావతి కొట్టి వేస్తూ తీర్పును వెలువరించింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగా కేసు నమోదు చేసినట్టుగా గుర్తించి వారిని మందలించారు.