- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
దిశ ఎఫెక్ట్.. సేవ్ భద్రాద్రి ఆధ్వర్యంలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం
దిశ, భద్రాచలం: సేవ్ భద్రాద్రి రెండు సంవత్సరాల క్రితం వరద బాధితుల సహాయార్ధం వసూలు చేసిన నిధులతో, గోదావరి వరదలు సమయంలో ప్రజల ప్రాణాలు రక్షించడానికి భద్రాద్రి వచ్చే ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలకు షెల్టర్ నిర్మాణం చేపట్టాలని ' దిశ ' కధనానికి సేవ్ భద్రాద్రి సేవా సంఘం స్పందించింది. ఈ మేరకు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సేవ్ భద్రాద్రి అధ్యక్షుడు పాకాల దుర్గాప్రసాద్ మాట్లాడుతూ, స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానం పక్కన గల 20 సెంట్లు భూమిలో మల్టీపర్పస్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేపడుతున్నామని, ఈ నెల 28 న భూమి పూజ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఈ హల్ నిర్మాణం వలన ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలకు వసతి కల్పించడంతో పాటు వరద భాధితులకు షెల్టర్‌గా ఉపయోగపడుతుందని తెలిపారు. ఇప్పటివరకు రూ. 36,91,000 దాతలు సహకరించారని అన్నారు. సుమారు కోటి రూపాయల నిధులతో ఈ హాల్ నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సేవ్ భద్రాద్రి కార్యదర్శి చారుగుళ్ల శ్రీనివాస్, ట్రెజరర్ ఎస్ కే అజీమ్, సభ్యులు పరిమి సోమ శేఖర్, గాదె మాధవ రెడ్డి, శ్రీనివాస్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.