Khammam MP : కాంగ్రెస్ ప్రజా సంక్షేమానికి పనిచేస్తుంది.

by Aamani |
Khammam MP : కాంగ్రెస్ ప్రజా సంక్షేమానికి పనిచేస్తుంది.
X

దిశ,సత్తుపల్లి: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమ పాలన అందిస్తుంటే చూసి ఓర్వలేని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కారు కూతలు కూస్తూ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి అన్నారు. సత్తుపల్లి స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ అధ్యక్షతన రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు తో కలిసి విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడుతూ, సీతారామ ప్రాజెక్టు పూర్తి అంచనా వ్యయం 19.వేల కోట్ల అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోరూ. 7.వేల కోట్లు ఖర్చు చేసి 90 % శాతం పనులు ఎలా పూర్తి చేసిందో కేసీఆర్,కేటీఆర్, హరీష్ రావు, చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం మోటర్లు కొనుగోలు చేసి పూర్తిచేశామని చెప్పటం హాస్యాస్పదమన్నారు.

గత పార్లమెంట్ సమావేశాల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో విమానాశ్రయం, ప్యాసింజర్ రైల్వే ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పదేళ్ల పాలనలో కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన రాష్ట్ర విభజన నిధులు తెచ్చుకోలేకపోయిందని ఆయన ఎద్దేవా చేశారు. సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ మాట్లాడుతూ, మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం పై మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు అర్థరహితమని, మహిళలు సమయాన్ని వృధా చేయకుండా సద్వినియోగం పరుచుకుంటే హేళన చేసి మాట్లాడడం తగదని హెచ్చరించారు.కేసీఆర్ పాలనలో మహిళలకు కనీసం మంత్రి పదవి ఇవ్వలేదని తక్షణమే కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. మహిళల పట్ల బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఎంత ఉందో కేటీఆర్ వ్యాఖ్యలతో అద్దం పడుతుందని ఆమె అన్నారు.

ఫ్రీ బస్సుల్లో మహిళలు డాన్స్లు వేస్తున్నారని జీవన ఉపాధి కోసం డాన్స్ వేసి మహిళలను అవమానపరుస్తున్నారని ఆమె అన్నారు,రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయ్ బాబు మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికల్లో ఖమ్మం జిల్లా ఎంపీ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ లో రాష్ట్రంలో రెండో స్థానం లభించడం చాలా గర్వకారణమని.పార్లమెంట్ నిధుల్లో సత్తుపల్లి కి అత్యధిక నిధులు అందించి సత్తుపల్లి నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆధ్వర్యంలో ఆదర్శవంతమైన సత్తుపల్లి నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు ఎంపీ రఘురాం రెడ్డి సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ దయానంద్ విజయకుమార్, జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు రామిశెట్టి సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉడతనేని అప్పారావు, చల్లగుళ్ళ నరసింహారావు, మందపాటి ముత్తారెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, గాదె చెన్నారావు, వార్డు కౌన్సిలర్ కంటే నాగలక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story