నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా.. ఎమ్మెల్యే మట్టా

by Sumithra |
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటా.. ఎమ్మెల్యే మట్టా
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గంలో నిత్యం ప్రజలకు ప్రజాసేవకై అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అన్నారు. సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో ఆదివారం తెలంగాణ రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే రాగమయి పలువురు ప్రభుత్వ అధికారులతో కలిసి జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీల్లో మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టిందని రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మహిళలకు పెద్దపీట వేసిందని అన్నారు. ఈ ప్రాంత మహిళలకు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటామని తెలంగాణ రాష్ట్రంతో పాటు ఖమ్మం జిల్లాలో ముగ్గురుకి మంత్రివర్గంలో అవకాశం లభించిందని మేము మంత్రులతో మమేకమై జిల్లా అభివృద్ధి పరుగులు పెట్టిస్తామని ఆమె అన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులు కార్మికుల సమస్యలను రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి త్వరలోనే పరిష్కారం చూపుతారని స్థానిక సమస్యలకు పరిష్కారానికి కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు. మహిళలు మహాలక్ష్మి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను తప్పకుండా నెరవేస్తుందని ఆమె ఆశ భావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో కల్లూరు ఆర్డీవో అశోక చక్రవర్తి సాన్దిక ఎమ్మార్వో యోగేశ్వరరావు, కల్లూరు ఏసీపీ రామానుజం, మేనేజర్ యు రాజలక్ష్మి, అసిస్టెంట్ మేనేజర్ విజయ శ్రీ, మున్సిపల్ కమిషనర్ కే సుజాత, ఐసీడీఎస్ సీడీపీఓ, కొండమ్మ, జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మట్టా దయానంద్ విజయకుమార్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు నారాయణ వరపు శ్రీనివాసరావు, ఆర్టీసీ ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు తదితరులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed