రేపు సాయంత్రంలోగా అకౌంట్లలోకి రూ. 10 వేలు జమ

by Sridhar Babu |
రేపు సాయంత్రంలోగా అకౌంట్లలోకి రూ. 10 వేలు జమ
X

దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలోని వరద ముంపు బాధితులకు ప్రభుత్వ సాయంతో పాటు పొంగులేటి స్వరాజ్యం - రాఘవరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ తరుపున తమ వంతు సాయం కూడా అందించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, విపత్తు నివారణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. ఖమ్మం రూరల్ మండలంలోని రాజీవ్ గృహకల్ప, కరుణగిరి, నాల్గవ తరగతి ఉద్యోగుల కాలనీ, జలగం నగర్, పెద్దతండా, కేబీఆర్ నగర్, అభయటౌన్ షిప్, దానవాయిగూడెం, రామన్నపేట తదితర ప్రాంతాల్లో బాధితులకు అందుతున్న వరద సహాయక చర్యలను ద్విచక్రవాహనం పై కలియతిరుగుతూ పరిశీలించారు.

ఈ ప్రాంతాల్లో శానిటేషన్​ పనులను సైతం పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ... ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వరద ముంపు బాధితులకు శుక్రవారం సాయంత్రంలోగా రూ.10వేల వారి అకౌంట్లలోకి జమ చేయడం జరుగుతుందని అన్నారు. ప్రతి ఇంటికి వరద సాయం అందజేస్తామని, బాధితులు ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కట్టు బట్టలతో సహా అనేక కుటుంబాలు నష్టపోయాయన్నారు. మహిళలకు రెండు చీరలు, పురుషులకు రెండు లుంగీలతో పాటు రెండు టీ షార్ట్ లను అందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed