flood affected areas : వరద ప్రభావిత ప్రాంత బాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తల అండ...

by Sumithra |   ( Updated:2024-07-27 14:46:15.0  )
flood affected areas : వరద ప్రభావిత ప్రాంత బాధితులకు బీఆర్ఎస్ కార్యకర్తల అండ...
X

దిశ, భద్రాచలం టౌన్ : గోదావరికి వరద పెరుగుతున్నందున, ప్రభుత్వ యంత్రాంగం ఏర్పాటు చేస్తున్న గోదావరి వరద బాధితుల కేంద్రాల్లో బాధితులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలని ముఖ్యంగా గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు పాలు గుడ్లు, పోషకాహారం అందించాలని వరదల వల్ల నష్టపోతున్న రైతాంగాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలని బీఆర్ఎస్ మండల నాయకులు ఆకోజు సునీల్ కుమార్ కోరారు.

భద్రాచలం పట్టణంలో వరద ప్రభావిత కాలనీలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు వరద సహాయ చర్యలో పాల్గొని బాధితులకు అండగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన వరద బాధితులకు 10,000 రూపాయలు నష్టపరిహారం పెంచి నేడు ప్రభుత్వం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐనాల రామకృష్ణ, దానియేలు ప్రదీప్, లక్ష్మణ్, బడిశా నాగరాజు, చిట్టిమల్ల అనిల్, జల్లి రామకృష్ణ, తెల్లం రాణి, యాదామని తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed