- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గ్యాస్ వద్దు కట్టెల పొయ్యి ముద్దు
దిశ, సత్తుపల్లి: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, సత్తుపల్లి శాసనసభ్యులు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలంటూ సత్తుపల్లి పట్టణ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను అంచెలంచెలుగా 1200 రూపాయలకు పెంచి పేద ప్రజల నడ్డి విరుస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలన్నారు.
సత్తుపల్లి పట్టణానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మోనార్క్ రఫీ మాట్లాడుతూ... పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుబారం మోపుతుందని.. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అనంతరం గ్యాస్ పొయ్యి వద్దు కట్టెల పొయ్యి ముద్దు అంటూ బీజేపీ డౌన్ డౌన్ మోడీ ప్రభుత్వం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ దొడ్డ హైమావతి శంకర్రావు, జడ్పీటీసీ సభ్యులు రామారావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ తోట సుజల రాణి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు మల్లురంకం రాజు, వార్డు కౌన్సిలర్లు అద్దంకి అనిల్, చాంద్ బాషా, తడికమల్ల ప్రకాశరావు, మందపాటి పద్మజ్యోతి, కంటే నాగలక్ష్మి, నరుకుల్ల శ్రీనివాసరావు, మట్టా ప్రసాద్, పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- gas
- brs protest