బీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు నామినేషన్ దాఖలు పై తుమ్మల ఫైర్

by Sumithra |
బీఆర్ఎస్ అభ్యర్థి తప్పుడు నామినేషన్ దాఖలు పై తుమ్మల ఫైర్
X

దిశ, ఖమ్మం : మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ నామినేషన్ గండం వచ్చిపడింది. నామినేషన్ పత్రాల తపుడు ఫార్మేట్లో దాఖలు చేశారని మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఫైరయ్యారు. సోమవారం ఎస్ఆర్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలను వెల్లడించారు. వారు సూచించిన ఫార్మెట్ నామినేషన్ పత్రాలు ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల సంఘం ఇచ్చిన ఫార్మెట్ లో కాకుండా బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ మార్చి ఇచ్చారని ఆరోపించారు.

అఫిడవిట్ లో డిపెండెంట్ కాలమ్ మార్చారని, డిపెండెంట్ కాలమ్ లో ఎవ్వరు లేకపోతే నిల్ రాయకుండా మార్చారని తెలిపారు. నిర్దేశించబడిన ఫార్మాట్ లో లేకపోతే నామినేషన్ రిజెక్ట్ చేయాలని రిటర్నింగ్ అధికారిని ప్రశ్నించినట్టు తెలిపారు. ఇలాంటి తప్పుడు నామినేషన్ పై ఆర్.వో పై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల నియమ నిబంధనలు పాటించకుండా ఆర్.వో ఎన్నికల నిబంధనలు పాటించలేదని ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు బీఆర్ఎస్ అభ్యర్థి దాఖలు చేసిన దానిపై రిటర్నింగ్ అధికారి తీరుపై ఎన్నికల సంఘంకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. అవసరమైతే న్యాయస్థానానికి ఆశ్రయించి న్యాయ పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు.

Advertisement

Next Story