- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటే : రేణుక చౌదరి
దిశ, ఖమ్మం సిటీ : సీఎం కేసీఆర్ ప్రధాని మోదీ ఇద్దరూ ఒక్కటేనని, తెలంగాణలో బీజేపీ అడ్రస్ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి రేణుక చౌదరి అన్నారు. ఆదివారం ఆమె ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు. కేంద్రం కూడా ముందస్తు ఎన్నికలకు సిద్దమవుతోందన్నారు. నార్త్‌లో వంద సీట్లకుపైగా బీజేపీ కోల్పోబోతోందని పేర్కొన్నారు.
బీజేపీ దేశంలో విద్వేషాలను రెచ్చగొడుతోందని, మతతత్వ రాజకీయాలకు ఈ దేశంలో చోటు లేదన్నారు. పార్లమెంట్‌లో అసభ్యంగా.. అసహ్యంగా ప్రధాని మోదీ అబద్దాలు చెబుతున్నారని అన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేటీఆర్, కేసీఆర్‌ల మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదన్నారు. మంత్రి హరీష్ రావు టీవీ సీరియల్స్ రాసుకుంటే భవిష్యత్తు బాగుంటుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గంగా నది లాంటిదని, ఇందులోకి ఎంతో మంది వచ్చి స్నానం చేసి పునీతులవుతున్నారని కొనియాడారు. సర్వే నివేదికల ఆధారంగానే సీట్ల కేటాయింపు జరుగుతుందని పేర్కొన్నారు.