BIG River Project: ఉగ్రరూపం దాల్చిన పెద్దవాగు ప్రాజెక్ట్.. గేట్లు ఎత్తివేత, వరదలో చిక్కుకున్న 25 మంది

by Shiva |   ( Updated:2024-07-18 12:59:55.0  )
BIG River Project: ఉగ్రరూపం దాల్చిన పెద్దవాగు ప్రాజెక్ట్.. గేట్లు ఎత్తివేత, వరదలో చిక్కుకున్న 25 మంది
X

దిశ, వెబ్‌డెస్క్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. దీంతో వాగులు, వంకలు నిండి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఇక గురువారం సాయంత్రం భారీ వర్షం కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెదవాగు ప్రాజెక్ట్‌కు వరదనీరు పోటెత్తడంతో నిండుకుండరైంది. దాదాపు మూడు గేట్లు ఎత్తినా వదర ప్రవాహం మాత్రం ఆగడం లేదు. ఈ క్రమంలో నారాయణ‌‌పురం వాగులో 20 మంది చిక్కుకున్నారు. వారిని కాపాడేందుకు జిల్లా అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇక బచ్చువారిగూడెంలో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో భయంకరంగా వాగులో ఐదుగురు పశువుల కాపరులు చిక్కుకుపోయారు. వారు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు చెట్లపైకి ఎక్కి సాయం కోసం ఎదురు‌చూస్తున్నారు. జిల్లా అధికారుల సమాచారం మేరకు విషయం తెలుసుకున్న మంత్రి తుమ్మల హెలికాప్టర్ సాయంతో వారిని రక్షించాలని ఆదేశించారు. దీంతో హుటాహుటిన రంగంలోకి దిగిన ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది హెలికాప్టర్ సాయంతో వరదలో చిక్కుకున్న 20 మందిని సురక్షితంగా రక్షించారు. అలాగే, ఈ ఘటనపై మంత్రి తుమ్మల, సీఎం రేవంత్‌రెడ్డితో చర్చించారు.

Advertisement

Next Story