- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Puvvada Ajay Kumar : కార్యకర్తలకు అందుబాటులో ఉంటా
దిశ, ఖమ్మం : బీఆర్ఎస్ పార్టీ లో ప్రతి కార్యకర్తకు అందుబాటులో ఉంటానని, ఎవరూ కూడా అధైర్య పడొద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఆదివారం ఖమ్మం నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అనారోగ్య కారణాల వల్ల మీ మధ్యలో ఉండలేకపోయానని, ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని రాబోయే రోజుల్లో మీకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అమలు కాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిందని విమర్శించారు. రాష్ట్రంలో, జిల్లాలో పారిశుధ్యం లోపించిందని,
అందుకే డెంగ్యూ, మలేరియా లాంటి విష జ్వరాలు విజృంభిస్తున్నాయన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడా కూడా పారిశుధ్యం పనుల్లో నిర్లక్ష్యం చేయకుండా పర్యవేక్షించడం జరిగిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 9 నెలలు దాటినా కూడా ఇప్పటివరకు ఏ హామీ అమలు చేయలేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు చేరే విధంగా దశల వారీగా ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఎండగడతామన్నారు. అసెంబ్లీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు
మాట్లాడిన తీరు ప్రజలు గమనిస్తున్నారన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ లోటు ప్రజలకు తెలుస్తుందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రజల మధ్యలో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అనంతనం ప్రతి నాయకుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో మాజీ సూడా చైర్మన్ విజయ్ కుమార్, బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.