- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బాలికల హాస్టల్ లోకి దూరిన అటెండర్.. భయాందోళనకు గురైన విద్యార్థినీలు

దిశ ఖమ్మం సిటీ: ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఎస్సీ బాలికల వసతి గృహాలు మూడున్నాయి. విద్యార్థినీలు ఎన్ఎస్పీ ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసిస్తుంటారు. పాఠశాలలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమం తర్వాత అదే పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యువకుడు అర్ధరాత్రి 11 గంటల తర్వాత వసతి గృహానికి చేరుకుని గేటు దూకి లోపలికి దర్జాగా ప్రవేశించాడు. గుర్తించిన హాస్టల్ సిబ్బంది అతన్ని పట్టుకుని ఎన్ఎస్పీ క్యాంపు లోని పాఠశాలలో అటెండర్ గా పనిచేస్తున్న యువకుడిగా గుర్తించారు. దీంతో హాస్టల్ సిబ్బంది వార్డెన్ కు, పోలీసులకు సమాచారం అందించగా టూ టౌన్ పోలీసులు హాస్టల్ కు చేరుకొని జరిగిన సంఘటనపై విచారించారు. పోలీసులు ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బిర్యానీ తీసుకుని హాస్టల్ గేటు దూకి హాస్టల్లోకి ప్రవేశించినట్లు ఆ యువకుడు ఒప్పుకున్నట్లు తెలిసింది. అర్ధరాత్రి అంత అలజడి జరిగినా, విద్యార్థినీలు భయభ్రాంతులకు లోనైనా బుధవారం సాయంత్రం వరకు వసతి గృహ సంక్షేమ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ఖమ్మం టూ టౌన్ సంప్రదించగా తనకు ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. విద్యార్థినీల రక్షణ పై వీరికి ఉన్న బాధ్యత ఏంటో ఈ విషయం తేటతెల్లం చేస్తోంది.