ప్రజావాణిలో దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

by Shiva |
ప్రజావాణిలో దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్
X

దిశ ప్రతినిధి, కొత్తగూడెం: ప్రజావాణిలో సమస్యల పరిష్కారం కోరుతూ వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ ఉన్నతాధికారులను ఆదేశించారు.సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశపు హాలులో అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆయనే స్వయంగా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు సత్వరమే పరిష్కరించాలని, పరిష్కారం స్వభావాన్ని ప్రజావాణిలో పోర్టల్ లో అప్ లోడ్ చేయాలని సూచించారు. వచ్చే సోమవారం నాటికి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలని, లేని పక్షంలో అధికారులకు షోకాజు నోటీసులు జారీ చేయాలని డీఆర్వోకు సూచించారు. పరిష్కరించడానికి అవకాశం ఉన్నట్లయితే తక్షణం పరిష్కరించాలని, అవకాశం లేనట్లయితే అదే విషయాన్ని దరఖాస్తుదారుడికి లిఖితపూర్వకంగా అందచేయాలన్నారు.

Advertisement

Next Story

Most Viewed