- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఒలింపిక్స్ లక్ష్యంగా క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.. మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి..
దిశ, వైరా : ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారతదేశానికి ఒలంపిక్స్ లో సరైన స్థానం తీసుకురావడం కోసం ప్రత్యేక ప్రణాళికతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుందని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం వైరా సాంఘిక సంక్షేమ బాలికల గురుకులంలో 10వ జోనల్ స్థాయి జోనల్ స్పోర్ట్స్ మీట్ - 2024ను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ తో కలిసి పొంగులేటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఇందిరమ్మ రాజ్యంలో క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని విద్యార్థులు ఆ అవకాశాల్ని ఉపయోగించుకొని ప్రతిభను నిరూపించుకోవాలని సూచించారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు జరిగే జోనల్ స్థాయి క్రీడల్లో విద్యార్థులు సోదర భావంతో క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని ఆయన ఉద్భోదించారు. సంక్షేమ గురుకులాలు భవిష్యత్తులో ఇంటిగ్రేటెడ్ గురుకులాలుగా మరింత నాణ్యమైన, విద్యార్థికి అవసరమైన నైపుణ్యాల్ని అందిస్తామన్నారు. గురుకులంలోని ప్రతి విద్యార్థి చదువుతో పాటు సర్వతో ముఖాభివృద్దికి అవసరమైన క్రీడలు, సాంస్కృతిక నైపుణ్యాల పెంపొందించేందుకు కృషి చేస్తామన్నారు. విద్యార్థులు అన్ని అవకాశాలను ఉపయోగించుకొని క్రమశిక్షణతో ఎదగాలని ఆయన సూచించారు.
సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ జాయింట్ సెక్రెటరీ కంభంపాటి శారద గురుకుల క్రీడా ప్రతిభను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో విద్యార్థులు సాధించిన జాతీయ అంతర్జాతీయ ప్రతిభ పాటవాలను ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ మాట్లాడుతూ వైరా నియోజకవర్గాన్ని క్రీడల్లో ముందుకు తీసుకుపోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి సహకారంతో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్తులో వైరా నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తయారు చేయడానికి ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు తీసుకుంటానని తెలిపారు. విద్య వైద్యంతో పాటు క్రీడల్లోనూ సమ ప్రాధాన్యత ఇస్తూ ప్రతిభ చూపే విద్యార్థులను క్రీడాకారులను ఒలంపిక్స్ లక్ష్యంగా తీసుకుపోవడంలో ముందుంటానని స్పష్టం చేశారు.
ముందుగా జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచికగా జాతీయ జెండా, ఒలంపిక్స్, జోనల్ క్రీడా పథకాలను మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే రాందాస్ నాయక్, ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ లు ఎగురవేశారు. అనంతరం క్రీడాజ్యోతిని వెలిగించి విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కాంగ్రెస్ మండల పట్టణ అధ్యక్షులు శీలం వెంకట నర్సిరెడ్డి, ఎదునూరి సీతారాములు, 4వ జోనల్ ఆఫీసర్ కొప్పుల స్వరూప రాణి, జోనల్ స్పోర్ట్స్ మీట్ వివరాలు ఇన్చార్జ్ కె.శ్రీదేవి, ప్రిన్సిపల్ డాక్టర్ డి.సమత గురుకుల ప్రిన్సిపల్స్ చావా జ్యోతి, ఎం.పద్మావతి, పీవీ పద్మావతి, మీసాల సునీత, జ్యోతి లిల్లీ, విజయదుర్గ, విజయ్ కుమారి, మైథిలి, ఎం.స్వరూప రాణి, ఐనాల సైదులు రామయ్య బక్క నాగేశ్వరరావు రిణాధారి, కుసుమ, శివకుమారి, విజయ నిర్మల, జోనల్ సూపరిండెంట్ సంజీవరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, టి.సాయి కిరణ్, ఉపాధ్యాయ అధ్యాపకులు ఫిజికల్ డైరెక్టర్లు వ్యాయామ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.