నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు…

by Kalyani |
నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు…
X

దిశ, కొత్తగూడెం: పాఠశాలలు ప్రారంభం కావడంతో బడి బస్సులు రోడ్లపై పరుగులు పెడుతున్నాయి. అధిక శాతం బస్సులను నిబంధనలకు విరుద్ధంగా తిప్పుతున్నారని రవాణా శాఖ అధికారులకు ఫిర్యాదులు రావడంతో పాఠశాలలు ప్రారంభంమైన రెండో రోజు రవాణాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. నిబంధనలు అతిక్రమించి నడుపుతున్న బస్సులపై కొరడా ఝులిపించారు. బస్సుల కండీషన్‌, ఫస్ట్ ఎయిడ్ బాక్సులు, ఇన్సూరెన్స్, పర్మిట్, అటెండర్‌ లేని బస్సులపై కేసులు నమోదు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వ్యాప్తంగా స్కూల్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి తోట కిషన్ రావు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మొత్తం 229 బస్సులు ఉండగా పార్టీలో గురువారం వరకు 136 బస్సులు మాత్రమే ఫిట్నెస్ అయినట్టు రవాణా శాఖ అధికారి తోట కిషన్ రావు తెలిపారు. ఇంకా 93 బస్సులు ఫిట్నెస్ కు రావాల్సి ఉందన్నారు. నిబంధనలు ఉల్లంఘించి, నిబంధనలకు విరుద్ధంగా నడిపిన మూడు బస్సులు సీజ్ చేసినట్టు వారు తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే జరిమానాలు తప్పవు అని అధికారులు తెలిపారు. బస్సులను పరిశీలించిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విద్యాసంస్థలు బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

Advertisement

Next Story