- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
syndicate : వైరాలో చికెన్ వ్యాపారుల సిండికేట్
దిశ, వైరా : వైరాలో చికెన్ వ్యాపారులు సిండికేట్ గా ఏర్పడి అదనపు వసూళ్లకు పాల్పడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. వైరా మండలంలోని గ్రామాల్లో ఉన్న చికెన్ దుకాణాల్లో కంటే వైరాలోని దుకాణాల్లో కిలోకి 50 నుంచి 70 రూపాయల వరకు అదనపు దోపిడీ కి పాల్పడుతున్నారని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. కిలో చికెన్ కు పేపర్ రేటు కంటే 30 నుంచి 35 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు. వైరా పట్టణంలో మొత్తం 10 చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల వ్యాపారులందరూ ఓ యూనియన్ గా ఏర్పడి దశాబ్దాల కాలంగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. అయితే గత 10 రోజుల క్రితం చికెన్ ధర తగ్గింది. వైరా మండలంలోని జింకల గూడెంలో 4, రెబ్బవరంలో 3, పాలడుగులో 2, గొల్లపూడిలో 3 చికెన్ దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల్లో
గత 10 రోజులుగా స్కిన్, స్కిన్ లెస్ కేజీ చికెన్ ను 140 నుంచి 160 రూపాయలకు విక్రయిస్తున్నారు. కిలో లైవ్ కోడిని 110 రూపాయలకు విక్రయిస్తున్నారు. అయితే వైరాలోని చికెన్ దుకాణాల్లో స్కిన్ చికెన్ కిలో రూ. 200 , స్కిన్ లెస్ చికెన్ కిలో రూ.220 , లైవ్ కోడి కిలో రూ.140 లకు విక్రయిస్తున్నారు. మంగళవారం పేపర్ ధర ప్రకారం కిలో స్కిన్ చికెన్ రూ.165, స్కిన్ లెస్ రూ.188, కిలో లైవ్ కోడి రూ. 114 రూపాయలకు విక్రయించాల్సి ఉంది. అయితే వైరాలోని వ్యాపారులు పేపర్ రేటుకు కూడా చికెన్ విక్రయించడం లేదు. ప్రస్తుతం ప్రముఖ కంపెనీల ఫామ్ ల్లో లెస్ రేట్లు పోను రవాణా సౌకర్యంతో కలిపి కిలో లైవ్ కోడిని 78 రూపాయలకు
వ్యాపారుల దుకాణాల వద్ద దిగుమతి చేస్తున్నారు. అయినప్పటికీ వైరాలో కిలో స్కిన్, స్కిన్ లెస్ చికెన్ ను 200 నుంచి 220 రూపాయల వరకు విక్రయిస్తున్నారు. అయితే వైరాలో విక్రయించే చికెన్ నాణ్యమైనదని, ఓ ప్రముఖ ట్రేడర్ నుంచి వచ్చేదని వ్యాపారులు చెబుతున్నారు. గ్రామాల్లోని వ్యాపారులు కూడా వైరాలోని వ్యాపారులకు కోళ్లు ఇచ్చే ట్రేడర్ నుంచే తాము దిగుమతి చేసుకుంటున్నామని స్పష్టం చేశారు. వైరా మండలం మొత్తానికి ఒక ప్రముఖ ట్రేడర్ కోళ్లను దిగుమతి చేస్తున్నారు. వైరాలో చికెన్ ధరలు మండిపోతుండటంతో గ్రామాల్లోని చికెన్ షాపుల వద్ద నుంచి చికెన్ తెచ్చుకునేందుకు స్థానికులు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు స్పందించి వైరాలో చికెన్ ధరలను నియంత్రించాలని స్థానికులు కోరుతున్నారు.
- Tags
- syndicate