- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పోగొట్టుకున్న 220 మొబైల్ ఫోన్లు రికవరీ
దిశ ప్రతినిధి, కొత్తగూడెం : జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేసి తిరిగి వారికి అందజేసినట్టు జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో అందుకున్న ఫిర్యాదులతో బాధితులు కోల్పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టినట్టు తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న 220 మంది బాధితులకు ఎస్పీ కార్యాలయంలో తిరిగి వారి ఫోన్లను అప్పగించారు.
మొబైల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులు వెంటనే CEIR పోర్టల్ లో ఆన్లైన్ ద్వారా అడిగిన అన్ని రకాల వివరాలను నమోదు చేసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్ నుండి తిరిగి వారి మొబైల్ ఫోన్లను ట్రాక్ చేసి కనిపెడతామని అన్నారు. బాధితుల మొబైల్ ఫోన్లను కనిపెట్టి వారికి అందజేయడంలో కృషి చేసిన జిల్లా పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ అభినందించారు. అనంతరం వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.