- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమానాస్పద స్థితిలో 16 మేకలు మృతి
దిశ, టేకులపల్లి : అనుమానాస్పద స్థితిలో 16 మేకలు మృతి చెందిన సంఘటన మండల పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని లచ్చగూడెం గ్రామానికి చెందిన జబ్బా వెంకటేశ్వర్లుకు చెందిన 30 మేకలను కాపరి మేత కోసం సమీప కోయగూడెం ఓసీ వైపు తీసుకువెళ్లారు. మేతమేస్తున్న క్రమంలో మధ్యాహ్న సమయంలో 30 మేకల్లో 16 మేకలు అపస్మారక స్థితిలోకి పోయి ఆ తర్వాత కాసేపటికి మృతి చెందాయి. విషయం తెలుసుకున్న బోడు ఎస్ఐ పొడిశెట్టి శ్రీకాంత్ అక్కడికి చేరుకుని మేకల మృతిపై దర్యాప్తు చేపట్టారు. తనకు న్యాయం చేయాలని రైతు జబ్బా వెంకటేశ్వర్లు కోరుతున్నాడు.
నాలుగు నెలల క్రితం కూడా ఇదే తరహాలో కోయగూడెం ఓసీ సమీపంలో నాలుగు మేకలు మృతి చెందాయని బాధిత రైతులు ఆరోపించారు. చనిపోయిన మేకలను సేకరించి కోయగూడెం మైన్ ప్రధాన రహదారి మీద అడ్డంగా పెట్టి మేకల బాధితులకు న్యాయం చేయాలని ధర్నా నిర్వహించారు. అలా ఎందుకు చనిపోతున్నాయని, గాలిలో విషవాయుపులు ఏవైనా వెలువడుతున్నాయా అని ఎంక్వైరీ చేయించి రిపోర్టును సింగరేణి అధికారులు తెప్పించాలని బాధితులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు కోరం సురేందర్ సింగరేణి అధికారులతో చర్చించారు. బేతంపూడి పీఏసీఎస్ సొసైటీ అధ్యక్షుడు లక్కినేని సురేందర్ రావు మేకల రైతుకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. టేకులపల్లి సీఐ తాటిపాముల సురేష్, బోడు ఎస్సై .శ్రీకాంత్ కలిసి బాధిత రైతులు, అధికారులతో న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.