ఖమ్మం: బుడిదంపాడు-మంచుకొండ మధ్య ఘోర రోడ్డు ప్రమాదం

by GSrikanth |   ( Updated:2023-02-07 06:14:37.0  )
ఖమ్మం: బుడిదంపాడు-మంచుకొండ మధ్య ఘోర రోడ్డు ప్రమాదం
X

దిశ, వెబ్‌డెస్క్: ఖమ్మం జిల్లాలోని బుడిదంపాడు-మంచుకొండ మధ్య ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిరప పంటను విక్రయించేందుకు కొందరు రైతులు ట్రాలీ వాహనంతో మంగళవారం తెల్లవారుజామున ఖమ్మం టౌన్‌కు వస్తున్నారు. ఈ క్రమంలో బుడిదంపాడు-మంచుకొండ ప్రాంతానికి రాగానే ట్రాలీ వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే దుర్మరణం చెందగా.. ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని మృతుడు భద్రాద్రి జిల్లా టేకులపల్లి వాసి హనుమంతుగా(45) గుర్తించారు. క్షతగాత్రులను దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also Read..

రంగారెడ్డిలో విషాదం.. భార్య చూస్తుండగానే భర్త సూసైడ్

Advertisement

Next Story