బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్లే సీఎం.. రఘునందన్ కీలక వ్యాఖ్యలు

by Javid Pasha |   ( Updated:2023-10-26 15:03:41.0  )
బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్లే సీఎం.. రఘునందన్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే దానిపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు కీలక ప్రకటన చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ బిడ్డ సీఎం అవుతారని వ్యాఖ్యానించారు. జనాభాలో 55 శాతం మంది బీసీలు ఉన్నారని, వారికి మూడు మంత్రి పదవులు మాత్రమే ఇచ్చారని అన్నారు. అయితే జనాభాలో ఒక్క శాతం కూడా లేని కేసీఆర్ వర్గానికి నాలుగు పదవులా? అని రఘునందన్ ప్రశ్నించారు. గజ్వేల్ ప్రజలు ఓడిస్తారనే భయంతోనే కేసీఆర్ కామారెడ్డి వెళ్లారని ఆరోపించారు.

గజ్వేల్‌లో నిర్వహించిన విజయశంఖారావ సభలో రఘునందన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. హుజూరాబాద్‌లో ఈటలను ఓడించడానికి ఉపఎన్నికల సమయంలో ఇంటికి రూ.10 లక్షలు ఇచ్చారని, గజ్వేల్‌లో కేసీఆర్ ఇచ్చాడా? అని ప్రశ్నించారు. గజ్వేల్‌లో ఈటల గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Next Story