- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ రాష్ట్ర సమితిలో KTR కు కీలక బాధ్యతలు!!
బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఐటీ మంత్రి కేటీఆర్ ను నియమిస్తారని తెలుస్తున్నది. ఇప్పటి వరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు చూసిన ఆయన ఇకపై బీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి వ్యవహరించే చాన్స్ ఉన్నది. టీఆర్ఎస్ పేరు మారిన కారణంగా ఆ పార్టీ పదవులన్నీ రద్దవుతాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యవర్గాల ఏర్పాటు కీలకంగా మారనుంది. ఈ క్రమంలో మంత్రి హరీశ్ రావు ఏ పాత్ర పోషిస్తారు..? ఇతర రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను ఎవరు సమన్వయం చేస్తారు..? అక్కడ శాఖల ఏర్పాటు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలు ఎవరు చేయాలనే అంశం ఆసక్తికరంగా మారింది. హరీశ్‌రావుతోపాటు మరో ముగ్గురు మంత్రులకు సైతం కేసీఆర్ బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు అప్పగించనున్నారని తెలుస్తున్నది.
దిశ,తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ పార్టీలో కేటీఆర్ రోల్ ఏంటీ? ఆయనకు ఏ పదవి ఇస్తారు? బీఆర్ఎస్ కు జనరల్ సెక్రటరీగా నియమిస్తారా? లేక బీఆర్ఎస్ తెలంగాణ స్టేట్ కు అధ్యక్షుడిగా నియమిస్తారా? అనే చర్చ మొదలైంది. నిన్నటి వరకు మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఇప్పుడు ఆ పార్టీ బీఆర్ఎస్ గా మారగానే గతంలో ఉన్న పార్టీ పదవులు రద్దవుతాయి. కొత్తగా మళ్లీ పదవులను భర్తీ చేయాల్సి ఉంటుంది. జాతీయ కమిటీ, వివిధ రాష్ట్రాల అధ్యక్షులు, రాష్ట్రాల కమిటీలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీంతో కేటీఆర్ కు ఏ పదవి ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.
రాష్ట్ర పార్టీలో కేటీఆర్ కీలకం
బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత కేటీఆర్ రాష్ట్ర పార్టీలో కీలకం అవుతారని టాక్ ఉంది. ఇప్పటి నుంచి కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టనున్నారు. దీంతో కేటీఆర్ తెలంగాణ రాజకీయాలపై దృష్టి పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలో కేటీఆర్ కు కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. మూడోసారి పార్టీ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారని ఆయన సన్నిహితులు బలంగా చెప్తున్నారు. లోక్ సభ ఎన్నికల వరకు మాత్రమే కేసీఆర్ సీఎంగా ఉంటారంటున్నారు. ఆతర్వాత కేటీఆర్ కు పట్టాభిషేకం జరగుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్నది.
మిగతా రాష్ట్రాల బాధ్యులు ఎవరు?
దేశ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకలాపాలు మొదలుపెట్టాలంటే ఆ రాష్ట్రాల్లో పార్టీ బాధ్యులు అవసరం. అందుకు వెంటనే ఆక్కడ లీడర్లు దొరకడం కష్టం. అందుకని మంత్రుల్లో కొందరికి ఇతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ కార్యక్రమాలను కో–అర్డినేషన్ బాధ్యతలు అప్పగించే యోచనలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నట్టు తెలిసింది. ఆ జాబితాలో హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి,నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్,ప్రశాంత్ రెడ్డి పేర్లు ఉన్నట్టు తెలిసింది. ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా ఉన్న వినోద్ కుమార్ కు ఢిల్లీ ఇన్ చార్జి బాధ్యతలు అప్పగించే చాన్స్ ఉంది.
పార్టీ ఆఫీసుల పేర్లు మార్చుతారా?
పార్టీ పేరు మారడంతో ఇంతకాలం పార్టీ ఆఫీసుల పేర్లు కూడా మారుతాయా? అని లీడర్లు ఆరా తీస్తున్నారు. ఢిల్లీలో పార్టీ ఆఫీసు కు తెలంగాణ భవన్ కు నామకరణం చేశారు. కాని ఇప్పుడు ఆ బిల్డింగ్ కు బీఆర్ఎస్ భవన్ గా మార్చాలని కేసీఆర్ ఆదేశించినట్టు తెలిసింది. అయితే ప్రస్తుతం వరకు హైదరాబాద్ లో ఉన్న పార్టీ ఆఫీసుతో పాటు కొత్తగా జిల్లాల్లో నిర్మిస్తున్న పార్టీ ఆఫీసులను తెలంగాణ భవన్ గా పిలుస్తున్నారు. ఇప్పుడు ఆ ఆఫీసుల పేర్లను మార్చి, అక్కడ బీఆర్ఎస్ బోర్డు పెడుతారా? అని చర్చించుకుంటున్నారు.
Also Read....