తెలంగాణ శివసేన పార్టీలో కీలక నేత చేరిక

by GSrikanth |
తెలంగాణ శివసేన పార్టీలో కీలక నేత చేరిక
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శివసేన పార్టీలో కీలక నేత చేరారు. శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సింకారు శివాజీ సమక్షంలో ఓబీసీ సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు జీ.సుధాకర్ చేరారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. గత 20 ఏళ్లుగా ప్రజా సంఘాలలో సుధాకర్ కీలకంగా పనిచేశారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. బాల సాహేబ్ ఠాక్రే ఆశయాల కోసం పని చేసేందుకే పార్టీలో చేరినట్టు తెలిపారు.

తెలంగాణలో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేస్తానని అన్నారు. తానొక్కడినే కాదని.. అతి త్వరలో మరికొంత మంది పార్టీలో చేరబోతున్నారని తెలిపారు. అనంతరం సింకారు శివాజీ మాట్లాడుతూ.. తెలంగాణలో శివసేనను బలోపేతం చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్టు తెలిపారు. నిజానికి తెలంగాణలో బీసీ జనాభా మెజార్టీగా ఉన్నప్పటికీ సరైన గౌరవం దక్కడం లేదని అన్నారు. బీసీలకు రాజ్యాధికారం సాధించేందుకు ఎన్నో పోరాటాలు చేసిన సుధాకర్ శివసేన పార్టీలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు.

Advertisement

Next Story