లిక్కర్ స్కామ్.. కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం

by Ramesh N |
లిక్కర్ స్కామ్.. కవిత బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిఫాల్ట్ బెయిల్ పిటిషన్‌పై కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించిన సీబీఐ కేసులో కవితపై విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కేసులో కవిత పాత్రపై సీబీఐ సప్లిమెంటరీ ఛార్జిషీట్‌, డిఫాల్ట్ బెయిల్ పిటిషన్లపై విచారణ జూలై 22కి వాయిదా వేసింది. కోర్టులో జడ్జి కావేరి భవేజా ఆధ్వర్యంలో విచారణ జరిగింది. మద్యం కేసులో కవిత పాత్ర, ఈ నేపథ్యంలోనే సాక్ష్యాలతో కూడిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను దాఖలు చేసినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. దానిని పరిగణనలోకి తీసుకోవాలని న్యాయస్థానాన్ని కోరింది. ఈ అంశంపై విచారణ చేపడతామని న్యాయమూర్తి భవేజా తెలిపారు.

సీబీఐ కేసులో కవితకు డిఫాల్ట్ బెయిల్‌పై వాదనలు జరిగాయి. ఈ సందర్భంగా సీబీఐ ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని కవిత తరపు లాయర్ నితేష్ రానా కోర్టుకి తెలిపారు. మరోవైపు తప్పులు లేవని సీబీఐ తరపు న్యాయవాది కోర్టకు చెప్పారు. ఛార్జిషీట్‌లో తప్పులున్నాయని కోర్టు ఆర్డర్ ఫైల్ చేయాలని జడ్జి కావేరి భవేజా అన్నారు. కోర్టు ఆర్డర్ అప్‌లోడ్ కాలేదని కవిత తరపు న్యాయవాది నితేష్ రానా పేర్కొన్నారు. దీంతో జూలై 22కి తదుపరి విచారణను రౌస్ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. కాగా, ఢిల్లీ మద్యం కేసులో కవిత మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇదివరకు ఆమె బెయిల్ పిటిషన్ వేయగా రౌస్ అవెన్యూ కోర్టు తిరస్కరించింది.



Next Story