తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

by Sathputhe Rajesh |
తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీలను భారీగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బుధవారం సంక్షేమ హాస్టళ్ల డైట్ ఛార్జీలపై ఉన్నతాధికారులతో మంత్రులు హరీష్ రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డైట్ ఛార్జీల పెంపునకు కీలక నిర్ణయం తీసుకున్నారు. దాదాపు 25 శాతానికి పైగా డైట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించారు.

అందులోను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కర్నాటక రాష్ట్రాల కన్నా అత్యధిక డైట్ ఛార్జీలు తెలంగాణలోనే ఉండాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రులు పంపించారు. 3 నుంచి 7వ తరగతి విద్యార్థులకు రూ.1200, 8 నుంచి10వ తరగతి చదివే విద్యార్థులకు రూ.1400, ఇంటర్ టు పీజీ విద్యార్థులకు రూ.1875 డైట్ ఛార్జీలను పెంచాలని మంత్రులు ప్రతిపాదించారు.

Advertisement

Next Story

Most Viewed