- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి హై టెన్షన్ వైర్ లాంటోడు.. ముట్టుకోవడానికి కూడా ట్రై చేయొద్దు
దిశ, వెబ్డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం భువనగిరిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ను ఘోర పరాజయం తప్పదని అన్నారు. ఈ ఆవేదనతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే దమ్ము ఎవరికీ లేదని అన్నారు. రేవంత్ రెడ్డి హైటెన్షన్ వైర్ లాంటోడని ముట్టుకోవడానికి ట్రై చేస్తే మాడిపోవడం ఖాయమని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే 20 ఏళ్ల పాటు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని అన్నారు. అంతర్గతంగా ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీజేపీ కలిసే పోటీ చేస్తున్నాయని అన్నారు. బీఆర్ఎస్కు అనుకూల వాతావరణం చోట్ల బీజేపీ.. బీజేపీకి అనుకూలంగా ఉన్నచోట బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను బరిలో పెట్టారని విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా 14 పైగా సీట్లు కాంగ్రెస్ గెలుచుకోబోందని జోస్యం చెప్పారు. తమకు బీజేపీ, బీఆర్ఎస్లతో పోటీ లేదని.. నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థికి, భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థితో పోటీ అన్నారు. ఎవరు ఎక్కువ మెజార్టీ తెచ్చుకోవాలో అని పోటీ పడుతున్నామని చెప్పారు.