- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆవిర్భావ వేడుకల్లో గవర్నర్ తమిళిసై కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాజ్‌భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గవర్నర్ తమిళిసై ఈ వేడుకల్లో పాల్గొని ఉద్యమకారులకు సన్మానం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. ప్రత్యేక రాష్ట్రం కోసం అనేక మంది యువత చేసిన త్యాగాల్ని స్మరించుకునే ఆవిర్భావ దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారికి ఈ సందర్భంగా నివాళి అర్పిస్తున్నట్లు గవర్నర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతోనే రాష్ట్ర ప్రభుత్వం అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. కానీ, నేటికీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరడం లేదని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జై తెలంగాణ అంటే స్లోగన్ కాదని, ఆత్మగౌరవం అని అన్నారు. దేవుడు తనను తెలంగాణకు గవర్నర్‌గా పంపడం తాను చేసుకున్న అదృష్టమని అభిప్రాయపడ్డారు. నేను మీతో ఉన్నాను.. మీరు నాతో ఉన్నారు అని అన్నారు. తన జీవితంలో ప్రతి నిమిషం ప్రజల కోసం పనిచేస్తానని తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా జరిగితేనే అభివృద్ధి వెల్లడించారు.