- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రాష్ట్రంలో 90 నుంచి 100 స్థానాల్లో ఈజీగా గెలుస్తాం: కేటీఆర్
దిశ, వెబ్‌డెస్క్: రాబోయే అసెంబ్లీ ఎన్నికలపై మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో ముచ్చటగా మూడోసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 90 నుంచి 100 స్థానాల్లో బీఆర్ఎస్ ఈజీగా గెలుస్తుందని జోస్యం చెప్పారు. అంతేగాక, మూడోసారి తెలంగాణకు కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని అన్నారు. జనాల్లో ఆదరన ఉన్న ఎమ్మెల్యేలకే టికెట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తమ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పే దమ్ము ఉందా? అని కేటీఆర్ సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీ ఒక పార్టీ కాకుండా ఎన్జీవో, దుకాణాన్ని నడుపుకోవాలని సూచించారు. గుజరాత్‌లో ఎన్నికలు జరుగుతుంటే రాహుల్ పారిపోయాడని ఎద్దేవా చేశారు. పీవీ నరసింహారావును అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం గద్దె దిగాల్సిన అనివార్య పరిస్థితి దేశంలో ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. తొమ్మిదేళ్లలో దేశ అభివృద్ధికి, ప్రజలకు బీజేపీ ప్రభుత్వం చేసిన పనులేంటో చెప్పాలని ప్రశ్నించారు. నోట్ల రద్దుతో సామాన్యులను ఇబ్బందులు పెట్టడం తప్పా సాధించిందేం లేదని మండిపడ్డారు.
Also Read..