- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ.. ఎంఐఎంను మట్టికరిపిస్తాం
దిశ, తెలంగాణ బ్యూరో: దేశంలో కొన్ని రాష్ట్రాల్లో బీజేపీకి అసలు పోటీయే లేదని, అయితే కొన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యలో పోటీ ఉండనుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలోనూ బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో అనేక ఎన్నికలను చూశామని, కానీ ఎన్నికల నోటిఫికేషన్ లాంటివి రాకముందే ప్రజలు కమలం గుర్తుకు ఓటేయాలని నిర్ణయం తీసేసుకున్నారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ 17 స్థానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించారు. కేంద్రంలో మూడోసారి మోడీని ప్రధానిని చేసేందుకు యాత్రలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
మండల, అసెంబ్లీ, జిల్లా కేంద్రాల్లో రోడ్డు షోలు నిర్వహిస్తామన్నారు. యాత్రలపై ఇప్పటికే మండలాలు, జిల్లా స్థాయిలో చర్చలు జరిపామని తెలిపారు. 17కు 17 స్థానాల్లో గెలవడంపై దృష్టి సారిస్తున్నట్లు కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ స్థానంలో పోటీ చేయడంపై కాకుండా గెలవడంపై దృష్టి సారిస్తున్నామని, ఎంఐఎంను మట్టికరిపిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. 2019లో 4 పార్లమెంట్ స్థానాల్లో తమ పార్టీ విజయం సాధించిందని, ఈసారి భారీస్థాయిలో గెలవడంపై దృష్టిపెట్టామని పేర్కొన్నారు. మహిళలు, 80 శాతం యువత మోడీకి మద్దతు ఇస్తున్నారని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు. ఇది మోడీ యాత్ర.. దేశాభివృద్ధి కోసం జరుగుతున్న యాత్రగా అభివర్ణించారు. సుస్థిరత, అస్థిరతకు మధ్య జరుగుతున్న ఎన్నికగా ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో మంత్రులుగా ఉన్నవారు జైలుకు వెళ్లిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కానీ అలాంటి పరిస్థితి మారింది మోడీ వల్లనేనని ఆయన తెలిపారు.
అభ్యర్థుల జాబితాపై త్వరలోనే స్పష్టత రానుందని, జాతీయ పార్టీకి ఆశావహుల జాబితా ఇచ్చామన్నారు. అయితే ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో ఒక్క ఎంపీ సీటు కూడా తమ పార్టీ ప్రకటించలేదని, త్వరలోనే అనౌన్స్ చేస్తారన్నారు. తమ పార్టీకి చెందిన ఎన్నికల కమిటీ ఇంకా భేటీ అవ్వలేదని, అందుకే ఈ ఆలస్యమని చెప్పారు. కాగా, సోమవారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో స్టేట్ బీజేపీ ఎన్నికల కమిటీ, ఎలక్షన్ కమిటీ మేనేజ్మెంట్ కమిటీ మీటింగ్ జరుగనుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఇదిలా ఉండగా ఈనెల 13వ తేదీన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మేడిగడ్డ యాత్రకు తమ ఎమ్మెల్యేలు వెళ్లబోరని ఆయన వెల్లడించరాఉ. తాము ఇంతకుముందే వెళ్లి వచ్చామని, ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు తమ వద్ద ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా కృష్ణ జలాల వివాదంపై ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూర్చుని మాట్లాడుకుంటే సరిపోతుందని సూచించారు.
ఇకపోతే ప్రత్యేక ఉత్తర తెలంగాణ ఉద్యమంపై రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ స్పందించారు. బడ్జెట్‌లో ప్రాంతాల మధ్య హెచ్చు తగ్గులు ఏమైనా ఉంటే.. విబేధాలు వచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. దానిపై తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాట్లాడటం తప్పేం కాదన్నారు.