- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ నాకు పెద్ద దిక్కులాంటివాడు.. బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్
దిశ, వెబ్‌డెస్క్: బీజేపీలో చేరికపై మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ 10 సంవత్సరాలల్లో చేసిన అభివృద్ధిని చూసి బీజేపీ పార్టీలో చేరానని స్పష్టం చేశారు. ‘కేసీఆర్ నాకు పెద్ద దిక్కులాంటివాడు. కానీ మొన్నటి ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు పొడిచారు. కావాలనే కుట్రపూరితంగా వ్యవహరించి, చిల్లర రాజకీయాలు చేసి నన్ను ఓడించారు. ఆ మనస్తాపంతోనే బీఆర్ఎస్ పార్టీని వీడాను. ప్రత్యామ్నాయంగా బీజేపీలో చేరారు’ అని ఆరూరి రమేష్ స్పష్టత ఇచ్చారు.
కాగా, బీజేపీలో చేరికకు ముందు స్వయంగా కేసీఆరే ఆరూరి రమేష్‌ను బుజ్జగించారు. బీఆర్ఎస్ పార్టీని వీడనున్నారనే ప్రచారం తర్వాత మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ముఖ్య నేతలు ఆయనను కలిసి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అనంతరం ఇంటికి పిలిపించుకొని కేసీఆర్ మాట్లాడారు. అయినా వెనక్కి తగ్గకుండా ముందే తీసుకున్న నిర్ణయం ప్రకారం బీజేపీలో చేరారు. ఆరూరి రమేష్ బీజేపీ తరపున వరంగల్ ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉండే అవకాశం ఉంది. ఈ మేరకు బీజేపీ నుంచి ఆయనకు హామీ లభించినట్లు తెలిసింది. బీజేపీ ప్రకటించే వచ్చే జాబితాలో ఆరూరి పేరు రానున్నట్లు తెలుస్తోంది.
మోడీ ఈ 10 సంవత్సరాలల్లో చేసిన అభివృద్ధిని చూసి బీజేపీ పార్టీలో చేరాను
— Telugu Scribe (@TeluguScribe) March 21, 2024
కేసీఆర్ నాకు పెద్ద దిక్కులాంటివాడు కానీ మొన్నటి ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే వెన్నుపోటు రాజకీయాలు చేసి నన్ను ఓడించారు.. ఆ మనస్తాపంతోనే బీఆర్ఎస్ పార్టీని వీడాను - ఆరూరి రమేష్ pic.twitter.com/rdY81sELPH