- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికలు వచ్చినప్పుడే పాలిటిక్స్: CM Revanth Reddy
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి 2050 వైబ్రంట్ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ అభివృద్ధి పనుల కోసం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీతో కలిసి లండన్ సందర్శించామని చెప్పారు. అసలైన హైదరాబాద్ అంటే.. పాతబస్తీనే అని అన్నారు. హైదరాబాద్ అభివృద్ధికి ఎంతో మంది కృషి చేసి.. రాష్ట్ర రాజధానిని ప్రపంచపటంలో పెట్టారన్నారు. శుక్రవారం ఎంజీబీఎస్-ఫలక్‌నుమా మెట్రో రైలు మార్గానికి సీఎం రేవంత్ రెడ్డి శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వరుసగా అభివృద్ధి పనులతో ముందుకెళ్తున్నామన్నారు. ఎన్నికలు వచ్చిన సమయంలోనే రాజకీయాలని, మిగతా సమయాల్లో అభివృద్ధికి పనులకే ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశారు. అందరి సహకారంతో అభివృద్ధి పనులు చేపడతామన్నారు. హైదరాబాద్‌కు గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు.