హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర.. అసెంబ్లీలో సీఎం కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |
హైదరాబాద్‌ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీసే కుట్ర.. అసెంబ్లీలో సీఎం కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: గత బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీసే విధంగా బీఆర్ఎస్ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ప్రశాంతమైన నగరంలో శాంతి భద్రతలు దెబ్బతిన్నాయని మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలోనే దేశంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు జరిగాయని అన్నారు. తాము హైదరాబాద్ అభివృద్ధికి లక్షన్నర కోట్లు అంటే.. మూసీ అభివృద్ధికి అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తామని ప్రకటించారు.

గోషామహాల్ పోలీస్ స్టేషన్ క్వార్టర్స్ 30 ఎకరాల స్థలంలో కొత్త ఉస్మానియా ఆసుపత్రి నిర్మిస్తామని అన్నారు. పాత ఉస్మానియా బిల్డింగ్‌ను హెరిటేజ్ బిల్డింగ్‌గా ఉంచుతామని తెలిపారు. లా అండ్ ఆర్డర్‌ విషయంలో కఠినంగా ఉంటామని అన్నారు. అంతేకాదు.. త్వరలో రీజనల్ రింగ్ రోడ్ నిర్మిస్తామని చెప్పారు. ఒరిజినల్ సిటీ అభివృద్ధికి కూడా తాము కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. లండన్ తరహాలో హైదరాబాద్‌‌ను అభివృద్ధి చేయబోతున్నామని అన్నారు. ప్రపంచంతో పోటీ పడే నగరాన్ని రూపొందించబోతున్నట్లు వెల్లడించారు. కచ్చితంగా మూసీకి డీపీఆర్ ఉంటుందని.. త్వరలోనే మూసీ ప్రక్షాళనకు కన్సల్టెంట్‌లను నియమిస్తామని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed