Vinod Kumar: 2034 నుంచి జమిలి ఎన్నికలు

by Gantepaka Srikanth |
Vinod Kumar: 2034 నుంచి జమిలి ఎన్నికలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జమిలి ఎన్నికల విధానం 2034 నుంచి అమల్లోకి వస్తుందని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్​కుమార్ అన్నారు. జమిలి ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారో రాజ్యాంగ సవరణ బిల్లులో కేంద్రం స్పష్టంగా ఎక్కడా చెప్పడం లేదని వినోద్ కుమార్​అన్నారు. మంగళవారం పార్లమెంట్‌లో రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టిన, రాజ్యాంగాన్ని సవరించి దేశవ్యాప్తంగా ఒకే సారి పార్లమెంట్, శాసనసభలకు ఎన్నికలు నిర్వహించాలని పార్లమెంట్‌లో జమిలి ఎన్నికల బిల్లు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు వేర్వేరుగా ఏడాది పొడవునా నిర్వహించడం కారణంగా ఖర్చులు పెరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ సవరణ బిల్లులో పేర్కొనడం జరిగిందన్నారు.

పదే పదే ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నదని, ప్రతిసారి ఎన్నికలు జరుగుతున్నాయని అందుకే జమిలి ఎన్నికలు అని కేంద్రం చెప్పిందన్నారు. పదే పదే ఎన్నికలు జరగడం ద్వారా ప్రభుత్వాల సాధారణ, అభివృద్ధి కార్యక్రమాలపై ప్రభావం చూపుతుందని, అందుకే జమిలి ఎన్నికలు అని కేంద్రం చెబుతుందని అన్నారు. రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 82 (ఏ) అనేది కొత్తగా పొందుపర్చాలని చూస్తున్నారని, ఈ ఆర్టికల్ ప్రకారం 2029లో కొత్తగా లోక్‌సభ ఏర్పాటైన రోజు నుంచి ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అమలులోకి వస్తుందని, ఇందులో పేర్కొందని వినోద్​ కుమార్​ తెలిపారు.

అంటే పార్లమెంట్​ఎన్నికలు 2‌‌029 తరువాత అంటే లోక్‌సభతో పాటుగా 2034 కి జమిలి ఎన్నికల అమలు జరుగుతాయని, 2029 నుంచి 2034 మధ్యలో ఉన్న అసెంబ్లీ లు పదవీకాలాలపై ప్రభావం చూపుతుందని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ అభిప్రాయాన్ని జేపీసీ కి తెలుపుతామన్నారు. ఈ బిల్లును ప్రతిపక్షాలు వ్యతిరేకించాయని అన్నారు. ఈ బిల్లును జేపీసీలో చర్చించి, అసెంబ్లీల్లో, స్పీకర్​లు చర్చిస్తారని, దీనిపై మేధావివర్గాలు, ప్రజాప్రతినిధులు, స్పందిస్తారో వేచిచూడాలని అన్నారు.

Advertisement

Next Story

Most Viewed