- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Raghunandan Rao: రైల్వేల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే కొత్త రైల్వే స్టేషన్లు, కొత్త రైల్వేలైన్లతోపాటు మరిన్ని రైళ్లకు హాల్టింగ్ లభిస్తుందని ఆశించిన తెలంగాణ ప్రజలకు నిరాశే మిగిలిందని లోక్సభలో బీజేపీ ఎంపీ రఘునందర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని రైల్వే స్టేషన్లలో కరోనా కంటే ముందు హాల్టింగ్ ఉన్న అన్ని రైళ్లను ఆపాలనిరైల్వేశాఖను కోరారు. కరోనా తర్వాత పలు రైళ్ల హాల్టింగ్ఎత్తివేయడంతో తెలంగాణ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఈ మేరకు బుధవారం రైల్వే పద్దులపై చర్చ సందర్భంగా లోక్సభలో ఆయన మాట్లాడారు. అనేక దశాబ్దాలుగా రైల్వే ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాలు తెలంగాణ ను వంచించాయని మండిపడ్డారు.
ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టాక గజ్వేల్లో శంకుస్థాపన చేసి మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు రైల్వే లైన్ పూర్తి చేశారని, 1980లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మెదక్ లో పోటీ చేసి హామీ ఇచ్చిన మెదక్ రైల్వే లైన్ కూడా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చాకే పూర్తయిందన్నారు. తెలంగాణలో పెండింగ్లో ఉన్న. సర్వే పూర్తయిన పలు రైల్వే లైన్లను వెంటనే పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ నుంచి అదిలాబాద్ వరకు వయా నిర్మల్ లైన్కు సర్వే పూర్తయ్యిందని వెంటనే ఆ ప్రాజెక్టును పూర్తి చేయాలన్నారు. కరీంనగర్ నుంచి హసన్పర్తి వరకు కూడా రైల్వే లైన్ పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంఎంటీఎస్ రెండో దశను భాగ్యనగరంలో వెంటనే పూర్తి చెయ్యాలన్నారు. మెట్రో ను పఠాన్ బేరు, సంగారెడ్డి వరకు పొడిగించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సర్కారు రైల్వే ప్రాజెక్టులకు తనవంతు నిధులు ఇవ్వడం లేదని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. చేగుంటలో వెంటనే రైల్వే స్టేషన్ నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.