‘బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందే’.. BRS ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన MP రఘునందన్ రావు..!

by Satheesh |   ( Updated:2024-07-12 16:12:38.0  )
‘బీజేపీలో చేరాలంటే రాజీనామా చేయాల్సిందే’.. BRS ఎమ్మెల్యేలకు తేల్చి చెప్పిన MP రఘునందన్ రావు..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో జోరుగా ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు జరుగుతోంది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలుకావడంతో గులాబీ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఒక్కరొక్కరుగా కారు దిగి హస్తం గూటికీ చేరుతున్నారు. ఇప్పటికే ఎనిమిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే టార్గె్ట్‌గా ఆపరేషన్ ఆకర్ష్‌కు తెరలేపిన హస్తం పార్టీ.. మిషన్ కంప్లీట్ అయ్యే వరకు చేరికల పర్వాన్ని కంటిన్యూ చేయనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ పార్టీ వైఖరి ఈ విధంగా ఉంటే.. బీజేపీ మాత్రం ఆ పార్టీలో జాయిన్ అవ్వాలనుకునే ఎమ్మెల్యేలకు కండీషన్లు పెడుతుంది.

ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బైపోల్‌కు సిద్ధమైతేనే బీజేపీలోకి ఎంట్రీ ఉంటుందని కాషాయ పార్టీ కండిషన్ పెట్టినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఎమ్మెల్యేల చేరికల విషయంలో బీజేపీ వైఖరిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎంపీ రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదవికి రాజీనామా చేస్తేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని తేల్చి చెప్పారు. రాజీనామా చేసి ఉప ఎన్నికకు రెడీ అయితేనే బీజేపీలో జాయిన్ చేసుకుంటామని తమను సంప్రదిస్తున్న ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు చెప్పామని వెల్లడించారు.

ఎమ్మెల్యేల చేరికల విషయంలో కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ పార్టీ లాగే వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో బీఆర్ఎస్ మాదిరిగానే ఇప్పుడు కాంగ్రెస్ యధేచ్చగా పార్టీ ఫిరాయింపులకు తెరలేపిందని ఫైర్ అయ్యారు. నిత్యం రాజ్యాంగాన్ని పట్టుకునే ప్రసంగాలు ఇచ్చే కాంగ్రెస్.. అదే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను విస్మరించి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తుందని మండిపడ్డారు. ఇదిలా ఉంటే, ఓ పక్క అధికార కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టి వరుసగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుని పార్టీని స్ట్రాంగ్‌గా చేసుకుంటుంటే.. బీజేపీ మాత్రం పార్టీలోకి వస్తామన్న ఎమ్మెల్యేలకు ‘రిజైన్’ కండిషన్ పెట్టడం తెలంగాణ పాలిటిక్స్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Next Story

Most Viewed